రెండేళ్లలోనే కూటమి ప్రభుత్వం విఫలం
Actor ProfilePolitician

రెండేళ్లలోనే కూటమి ప్రభుత్వం విఫలం

Total News1
Movie Updates0
Sources1
రెండేళ్లలోనే కూటమి ప్రభుత్వం విఫలం
AP7AM13 Jun 2026
రెండేళ్లలోనే కూటమి ప్రభుత్వం విఫలం

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తికాకముందే అన్ని రంగాల్లో విఫలమైందని వైసీపీ శాసనమండలి పక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఈరోజు విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరగడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బొత్స పేర్కొన్నారు. రైతులకు తమ పంటలకు గిట్టుబాటు ధరలు లభించడం లేదని, జొన్న, మామిడి పంటలకు కూడా కనీస మద్దతు ధర అందడం లేదని అన్నారు. ఆక్వా రంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిందని ఆరోపించారు.విద్యాశాఖను మంత్రి నారా లోకేశ్‌కు అభివృద్ధి కోసం అప్పగించారా లేక దాన్ని నిర్వీర్యం చేయడానికా అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన సూపర్ సిక్స్, సూపర్ సెవన్ హామీలు ఏమయ్యాయని నిలదీశారు. ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రభుత్వం దాదాపు పక్కన పెట్టిందని విమర్శించారు.ఇటీవల తిరుపతిలో నిర్వహించిన సభను విజయోత్సవ సభగా కాకుండా 'వెన్నుపోటు ఉత్సవం'గా అభివర్ణించిన బొత్స, టీడీపీని 'వెన్నుపోటు పార్టీ'గా పేర్కొన్నారు. రైతులు యూరియా కోసం ఒడిశా నుంచి ఒక్కో బస్తా రూ.600 చొప్పున కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొందని ఆరోపించారు.ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చని ఈ ప్రభుత్వానికి ఒక్క నిమిషం కూడా అధికారంలో కొనసాగే హక్కు లేదని బొత్స వ్యాఖ్యానించారు. ‘రెండేళ్ల వెన్నుపోటు’ ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు