రిటైర్మెంట్ రోజే సీబీఐ చిక్కిన ఐఏఎస్ అధికారి.. రూ. 169 కోట్ల స్కామ్ లో అరెస్ట్
Actor ProfilePolitician

రిటైర్మెంట్ రోజే సీబీఐ చిక్కిన ఐఏఎస్ అధికారి.. రూ. 169 కోట్ల స్కామ్ లో అరెస్ట్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రిటైర్మెంట్ రోజే సీబీఐ చిక్కిన ఐఏఎస్ అధికారి.. రూ. 169 కోట్ల స్కామ్ లో అరెస్ట్
Samayam Telugu27 Aug 2026
రిటైర్మెంట్ రోజే సీబీఐ చిక్కిన ఐఏఎస్ అధికారి.. రూ. 169 కోట్ల స్కామ్ లో అరెస్ట్

ఇంకొన్ని గంటలు గడిస్తే ఆ ఐఏఎస్ అధికారి సర్వీస్ ముగుస్తుంది. సగర్వంగా రిటైర్మెంట్ ఇచ్చేస్తాడు. ఓ పెద్ద ఫంక్షన్‌లో పదవీ విరమణ వేడుక జరుగుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ సీబీఐ అధికారులు ఆ ఐఏఎస్ అధికారి షాక్ ఇచ్చారు. సరిగ్గా రిటైర్మెంట్ రోజే అరెస్టు చేశారు. ఈ ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. హర్యానాలో వెలుగు చూసిన రూ. 169 కోట్ల బ్యాంకింగ్ స్కామ్‌లో సీబీఐ కీలక చర్యలు చేపట్టింది. రిటైర్మెంట్ రోజునే ఐఏఎస్ అధికారి ప్రదీప్ కుమార్‌ను సీబీఐ అరెస్టు చేసింది. సీబీఐ వివరాల మేరకు.. హర్యానా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలిలో సెక్రటరీగా పనిచేసిన సమయంలో ప్రదీప్ కుమార్, రూ. 169 కోట్ల ప్రభుత్వ నిధులను ఫిక్స్‌డ్ డిపాజిట్లు సృష్టిస్తున్నామని చెప్పారు. అందుకు గాను చండీగఢ్‌లోని ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ శాఖకు బదిలీ చేయడానికి అనుమతులు కూడా ఇచ్చారు. READ MORE దర్యాప్తు చేపట్టిన సీబీఐ అధికారులు ఆ నిధులతో ఎలాంటి ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేయలేదని తేల్చారు. హర్యానా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి శాఖ అనుమతి లేకుండా ఒక బ్యాంక్ ఖాతా తెరిచినట్లు సీబీఐ గుర్తించింది. అనంతరం ఆ ఖాతా నుంచి అక్రమ డెబిట్ లావాదేవీల ద్వారా రూ. 169 కోట్లను దారి మళ్లించినట్లు సీబీఐ ఆరోపిస్తోంది. హర్యానా ప్రభుత్వ విభాగం ఎదుర్కొన్న అతిపెద్ద బ్యాంకింగ్ స్కామ్‌లలో ఒకటిగా సీబీఐ చెబుతోంది. READ MORE సీబీఐ పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ ప్రదీప్ కుమార్ విచారణకు సహకరించలేదని, అందుకే అరెస్టు చేసినట్లు తెలిపింది. అరెస్టు చేస్తారన్న సమాచారంతో ప్రదీప్ కుమార్ ముందుగానే పంచ్‌కులా కోర్టులో బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేసినట్లు సీబీఐ వెల్లడించడం విశేషం. ఆ పిటిషన్‌పై జూలై 2న విచారణ జరగాల్సి ఉండగా, అంతకు ముందే ఆయన్ను సీబీసీఐ అదుపులోకి తీసుకుంది. కేవలం రూ. 169 కోట్ల మోసానికే ఇది పరిమితం కాలేదని, హర్యానాలోని ఎనిమిది ప్రభుత్వ

ర ట ర మ ట ర జ స బ ఐ చ క క న ఐఏఎస అధ క ర ర 169 క ట ల స క మ ల అర స ట Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in