రూటు మార్చిన బోయపాటి... కోలీవుడ్ స్టార్ సూర్యతో ఊర మాస్ పాన్ ఇండియా జాతర
Actor ProfileActor

రూటు మార్చిన బోయపాటి... కోలీవుడ్ స్టార్ సూర్యతో ఊర మాస్ పాన్ ఇండియా జాతర

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రూటు మార్చిన బోయపాటి... కోలీవుడ్ స్టార్ సూర్యతో ఊర మాస్ పాన్ ఇండియా జాతర
Samayam Telugu31 Jul 2026
రూటు మార్చిన బోయపాటి... కోలీవుడ్ స్టార్ సూర్యతో ఊర మాస్ పాన్ ఇండియా జాతర

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హై-వోల్టేజ్ యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన దర్శకుడు బోయపాటి శ్రీను నెక్ట్స్ సినిమాపై చిత్ర పరిశ్రమలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. వెండితెరపై హీరోలను ఊర మాస్ రేంజ్‌లో ఎలివేట్ చేస్తూ, థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు తెప్పించడంలో బోయపాటి శైలి ప్రత్యేకం. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణతో ఆయనకు ఉన్న సక్సెస్ ట్రాక్ రికార్డ్ అసాధారణమైనది. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించాయి. అయితే బాలకృష్ణ కాకుండా ఇతర స్టార్ హీరోలతో బోయపాటి చేసిన ప్రయోగాలు ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేకపోయాయి. గత కొంతకాలంగా బాలయ్య మినహా మిగిలిన హీరోలతో ఆయన చేసిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా లేదా పరాజయాలుగా మిగిలాయి. ఈ క్రమంలోనే గతేడాది భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన వీరి క్రేజీ సీక్వెల్ ‘అఖండ-2’ సైతం ట్రేడ్ వర్గాలను నిరాశపరిచింది. ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్‌కే పరిమితమవ్వడమే కాకుండా, దాదాపు రూ. 80 కోట్లకు పైగా భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చిందని ఇండస్ట్రీ టాక్.* చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు, దర్శకుడు కె. భాగ్యరాజ్ కన్నుమూత ఈ నేపథ్యంలో తనపై వస్తున్న విమర్శలకు గట్టి సమాధానం చెప్పేందుకు మరియు తన సక్సెస్ గ్రాఫ్‌ను మళ్లీ టాప్‌కు తీసుకెళ్లేందుకు బోయపాటి ఒక వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు. కేవలం టాలీవుడ్‌కే పరిమితం కాకుండా, ఈసారి కోలీవుడ్ మార్కెట్‌పై కన్నేశారు. విలక్షణ నటనతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న తమిళ స్టార్ హీరో సూర్యతో ఒక భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ చేయడానికి బోయపాటి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సూర్యకు ఒక పవర్‌ఫుల్ స్టోరీ లైన్ వినిపించగా, దానికి ఆయన పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దీనితో ఏమాత్రం సమయం వృథా చేయకుండా బోయపాటి శ్రీను ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులను