రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడి నెక్స్ట్ ఫిల్మ్ ఆ హీరోతోనేనా
Actor ProfilePolitician

రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడి నెక్స్ట్ ఫిల్మ్ ఆ హీరోతోనేనా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడి నెక్స్ట్ ఫిల్మ్ ఆ హీరోతోనేనా
Chitrajyothy10 Aug 2026
రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడి నెక్స్ట్ ఫిల్మ్ ఆ హీరోతోనేనా

తొలి చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’ తోనే సంచలన విజయాన్ని అందుకుని, టాలీవుడ్‌లోని అందరి చూపు తనపై పడేలా చేసుకున్న దర్శకుడు సాయిలు కంపాటి. ఈ సినిమా సక్సెస్ తర్వాత సాయిలు కంపాటికి టాలీవుడ్‌లో ఓ ప్రముఖ బ్యానర్ నుంచి అవకాశం వచ్చిన విషయం తెలిసిందే. తొలి చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’ (Raju weds Rambai) తోనే సంచలన విజయాన్ని అందుకుని, టాలీవుడ్‌లోని అందరి చూపు తనపై పడేలా చేసుకున్న దర్శకుడు సాయిలు కంపాటి (Saailu Kampati). ఈ సినిమా సక్సెస్ తర్వాత సాయిలు కంపాటికి టాలీవుడ్‌లో ఓ ప్రముఖ బ్యానర్ నుంచి అవకాశం వచ్చిన విషయం తెలిసిందే. ఏషియన్ సునీల్, పుస్కూరు రామ్మోహన రావు, భరత్ నారంగ్‌లకు చెందిన ఎస్వీసి ఎల్ఎల్‌పి బ్యానర్‌లో సాయిలు కంపాటి సినిమా చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన కూడా వచ్చింది. మళ్లీ తెలంగాణ నేపథ్యంలో సాగే ప్రేమకథనే సాయిలు తెరకెక్కించబోతున్నాడనేలా వార్తలు కూడా వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఈ సినిమాలో నటించే హీరోకు సంబంధించి వార్తలు మొదలయ్యాయి. అవును, సాయిలు కంపాటి డైరెక్ట్ చేయబోయే తదుపరి హీరో ఎవరో కాదు.. సుమంత్ ప్రభాస్ (Sumanth Prabhas) అని తెలుస్తోంది. ‘మేము ఫేమస్’, ‘గోదారి గట్టుపైన’ చిత్రాలతో హీరోగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న సుమంత్ ప్రభాస్‌‌తో సాయిలు కంపాటి తన నెక్స్ట్ పిక్చర్‌ని తెరకెక్కించబోతున్నారనేలా టాలీవుడ్ సర్కిల్స్‌గా బాగా వినిపిస్తోంది. అధికారిక ప్రకటన అయితే ఇప్పటి వరకు రాలేదు. అతి త్వరలోనే అనౌన్స్ చేయనున్నారనేలా టాక్ నడుస్తోంది. ఒక పెద్ద బ్యానర్‌లో రెండో సినిమా చేసే అవకాశం రావడం చాలా గొప్ప విషయం. ఈ సినిమాతో మరోసారి సక్సెస్ సాధిస్తే మాత్రం.. సాయిలు కంపాటి రేంజ్ కూడా పెరగడం ఖాయం. ఇక సుమంత్ ప్రభాస్ విషయానికి వస్తే.. ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా కథని మొదట సుమంత్ ప్రభాస్‌కే ఈ దర్శకుడు వినిపించాడట. కానీ, వరుసగా