రాజ్యసభలో రిచ్చెస్ట్ ఎంపీలు మనవాళ్లే.. టాప్ లో ఎంపీ
Actor ProfilePolitician

రాజ్యసభలో రిచ్చెస్ట్ ఎంపీలు మనవాళ్లే.. టాప్ లో ఎంపీ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రాజ్యసభలో రిచ్చెస్ట్ ఎంపీలు మనవాళ్లే.. టాప్ లో ఎంపీ, లిస్టులో ఎవరెవరు ఉన్నారంటే
Samayam Telugu18 Jul 2026
రాజ్యసభలో రిచ్చెస్ట్ ఎంపీలు మనవాళ్లే.. టాప్ లో ఎంపీ, లిస్టులో ఎవరెవరు ఉన్నారంటే

భారత పార్లమెంట్ ఎగువసభ అయిన రాజ్యసభలో తెలంగాణ ప్రజాప్రతినిధుల హవా నడుస్తోంది. అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫామ్స్‌ (ADR) దేశవ్యాప్తంగా ఉన్న 226 మంది సిట్టింగ్ రాజ్యసభ ఎంపీల ఆర్థిక, నేర, ఇతర నేపథ్యాలపై తాజాగా విడుదల చేసిన నివేదికలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం రాజ్యసభ సభ్యుల ఆస్తులతో పోలిస్తే.. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 18 మంది ఎంపీల వాటాయే ఏకంగా 39.39 శాతంగా నమోదైంది. ఈ మొత్తం సంపదలోనూ ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే తెలంగాణ ఎంపీల ఆస్తులే ఎక్కువ. మొత్తం 226 మంది ఎంపీల ఆస్తుల విలువ రూ.26,047 కోట్లు కాగా.. అందులో కేవలం తెలంగాణకు చెందిన ఏడుగురు ఎంపీల సంపదే ఏకంగా రూ.8,310 కోట్లుగా ఉంది. అంటే దేశవ్యాప్త ఎంపీల మొత్తం ఆస్తిలో దాదాపు మూడో వంతు వాటా తెలంగాణ ప్రజాప్రతినిధులదే కావడం గమనార్హం. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 11 మంది ఎంపీల ఆస్తుల విలువ రూ.1,949 కోట్లుగా ఉంది. నివేదిక ప్రకారం తెలంగాణలో 57 శాతం మంది, ఆంధ్రప్రదేశ్‌లో 45 శాతం మంది ఎంపీలు బిలియనీర్లుగా తేలారు.టాప్‌-3లో ఇద్దరు తెలంగాణ వారే..రాజ్యసభలో అత్యధిక ఆస్తులున్న తొలి ముగ్గురు ఎంపీలను పరిశీలిస్తే.. అందులో ఇద్దరు తెలంగాణ రాష్ట్రానికి చెందినవారే కావడం విశేషం. తెలంగాణ నుంచి బీఆర్ఎస్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న బండి పార్థసారథి రూ.5,300 కోట్ల ఆస్తులతో దేశంలోనే అత్యంత ధనిక రాజ్యసభ ఎంపీగా మొదటి స్థానంలో నిలిచారు. పంజాబ్‌కు చెందిన బీజేపీ ఎంపీ రాజేందర్‌ గుప్తా రూ.5,053 కోట్లతో రెండో స్థానంలో నిలవగా.. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్‌ ఎంపీ అభిషేక్‌ మను సింఘ్వీ రూ.2,558 కోట్లతో మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. తెలంగాణలో కేవలం ముగ్గురు బీఆర్ఎస్ సభ్యుల ఆస్తి విలువే రూ.5,524 కోట్లుగా ఉందని ఏడీఆర్ స్పష్టం చేసింది.నేర చరితలోనూ తెలంగాణే ఫస్ట్‌..క్రిమినల్ కేసులు ఉన్న ఎంపీల జాబితాలోనూ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే

ర జ యసభల ర చ చ స ట ఎ ప ల మనవ ళ ల ట ప ల ఎ ప Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in