రాజమౌళి పేరు చెప్పి మహేష్ బాబును భయపెట్టిన జూనియర్ ఎన్టీఆర్
Actor ProfileActor

రాజమౌళి పేరు చెప్పి మహేష్ బాబును భయపెట్టిన జూనియర్ ఎన్టీఆర్

Total News1
Movie Updates0
Sources1
రాజమౌళి పేరు చెప్పి మహేష్ బాబును భయపెట్టిన జూనియర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ ను ఆడేసుకున్న తారక్
Asianet News Telugu17 Jun 2026
రాజమౌళి పేరు చెప్పి మహేష్ బాబును భయపెట్టిన జూనియర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ ను ఆడేసుకున్న తారక్

ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల మధ్య మంచి స్నేహం ఉంది. కొంత మంది తప్పించి.. దాదాపు అందరు చాలా ఆప్యాయంగా ఉంటారు. టాలీవుడ్ యంగ్ హీరోలు, సీనియర్ హీరోలయితే.. కలిసినప్పుడల్లా సరదాగా పంచ్ లు వేసుకుంటూ ఎంజాయ్ చేస్తుంటారు. ప్రస్తుంతం స్టార్ హీరోలు గా ఉన్న ప్రభాస్ రామ్ చరణ్, రానా, ఎన్టీఆర్, అల్లు అర్జున్.. ఇలా ఫ్రెండ్స్ గా ఉన్న కొంత మంది హీరోలు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి రాజమౌళిని ఆటపట్టిస్తుంటారు. రానా రామ్ చరణ్, రానా నాగచైతన్య, ప్రభాస్ గోపీచంద్, అల్లు అర్జున్ ఎన్టీఆర్, ఇలా ఇండస్ట్రీలో అల్లరి చేసే హీరోలు ఎందరో. ఇక టాలీవుడ్ హీరోలలో చాలా సైలెంట్ గా, కామ్ గా కనిపించే మహేష్ బాబులో కూడా కొంటెతనం దాగుందని చాలామందికి తెలియదు. ఆయన వేసే రివర్స్ పంచ్ లు మామూలుగా ఉండవు. సందర్భాన్ని బట్టి ఆయనలో ఓ రైటర్, కమెడియన్, బయటకు వస్తుంటాడు. కొన్ని సందర్భాల్లో మహేష్ తో మాట్లాడలేక స్టార్స్ కూడా చేతులెత్తేసిన సందర్భాలు ఉన్నాయి. ఈక్రమంలోనే ఓ సారి యంగ్ టైగర్ ఎన్టీఆర్ మహేష్ బాబును ఓ ఆట ఆడుకున్నాడు. రాజమౌళి పేరు చెప్పి భయపెట్టాడు. మహేష్ బాబు కూడా ఏమాత్రం తగ్గకుండా తారక్ పై పంచ్ ల వర్షం కురిపించాడు. గతంలో మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమాన్ని తారక్ హోస్ట్ చేశాడు. ఈ ప్రోగ్రామ్ కు చాలామంది సెలబ్రిటీలు గెస్ట్ లు గా వచ్చారు. ఈక్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఓ ఎపిసోడ్ కు అతిధిగా వచ్చి అలరించారు. ఈక్రమంలో మహేష్ బాబు, ఎన్టీఆర్ మధ్య పంచ్ ల ప్రవాహం ఆడియన్స్ ను అలరించింది. మహేష్ బాబు ఫారెన్ టూర్ల గురించి చెపుతూ మహేష్ ను ఓ ఆట ఆడేసుకున్నాడు ఎన్టీఆర్. ఈక్రమంలో క్రికెట్ గురించి ప్రస్తావిస్తూ.. "మనం కూడా ఓ