
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Vemulawada Temple Extortion: దక్షిణ కాశిగా పేరుగాంచిన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ క్షేత్రంలో అక్రమాల దందా మితిమీరిపోతోంది.. స్వామివారిని.. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చి అమాయక భక్తులను టార్గెట్గా చేస్తూ కొందరు కేటుగాళ్లు నిలువు దోపిడీకి తెర లేపుతున్నారు.. ముఖ్యంగా ప్రముఖ వేములవాడ శ్రీ బద్ది పోచమ్మ ఆలయ ప్రాంగణంలో కొబ్బరికాయలు కొట్టాలంటే.. జేబులు ఖాళీ చేయాల్సిందే అనే విధంగా పరిస్థితి తయారయ్యింది. అధికారికంగా ఎలాంటి రుసుము లేకపోయినప్పటికీ.. భక్తుల నుంచి అడ్డగోలు డబ్బులు గుంజుతుండడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.. రూ.10 నుంచి రూ.50 వరకు డిమాండ్.. దూర ప్రాంతాల నుంచి ఎన్నో ఆశలతో పాటు నమ్మకంతో అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు కొబ్బరికాయ కొట్టే చోట చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి.. ఆలయం వద్ద కొబ్బరికాయలు కొట్టేందుకు ఎలాంటి ప్రభుత్వ లేదా దేవస్థాన రుసుము లేదు. కానీ.. అక్కడ తిష్ట వేసిన కొందరు ప్రైవేటు వ్యక్తులు తామే సర్వాధికారాలైనట్లు వ్యవహరిస్తున్నారు.. ఒక్కొక్క కొబ్బరికాయ కొట్టడానికి దాదాపు రూ.10 నుంచి మొదలుకొని.. ఏరా దీన్ని బట్టి రూ.5 వరకు డిమాండ్ చేస్తూ భక్తులను వేధింపులకు గురి చేస్తున్నారు.. డబ్బులు ఇవ్వని పక్షంలో భక్తులతో దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు ఆవేదన వ్యక్తమవుతోంది.. పట్టించుకోని అధికారులు.. భక్తుల ఆగ్రహం.. ఈ అక్రమ వసూళ్ల దందాపై పలువురు భక్తులు ఆలయ అధికారులతో పాటు సిబ్బందికి పదిసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకపోయిందని మండిపడుతున్నారు.. అధికారులకు అంతా తెలిసినప్పటికీ మౌనంగా ఉంటున్నారని.. అక్రమార్కులతో అధికారులకు ఏమైనా చేతులు కలిసాయా