రంగారెడ్డి జిల్లాలో పేలుడు.. కార్మికుడి మృతి
Actor ProfilePolitician

రంగారెడ్డి జిల్లాలో పేలుడు.. కార్మికుడి మృతి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రంగారెడ్డి జిల్లాలో పేలుడు.. కార్మికుడి మృతి
Andhra Jyothy27 Jun 2026
రంగారెడ్డి జిల్లాలో పేలుడు.. కార్మికుడి మృతి

రంగారెడ్డి జిల్లాలోని బడంగ్‌పేట్ ప్రాంతంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ పేలుడు సంబవించడంతో ఓ కార్మికుడు అక్కడికక్కడే మృతిచెందాడు. రంగారెడ్డి జిల్లా, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లాలోని బడంగ్‌పేట్ ప్రాంతంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ పేలుడు సంబవించడంతో ఓ కార్మికుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డెకరేషన్ గోదాంలో పనిచేస్తున్న కార్మికుడు.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. మృతుడిని పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాకు చెందిన అనూప్ ప్రధాన్‌గా (43) గుర్తించారు. జీవనోపాధి కోసం మూడు రోజుల క్రితమే ఆయన బడంగ్‌పేట్‌కు వచ్చి ఓ డెకరేషన్ గోదాంలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈ ఘటన జరిగిన సమయంలో అనూప్ ప్రధాన్ చెత్త కుప్ప సమీపంలో ఉన్నాడు. ఆ సమయంలో చెత్తలో ఉన్న గుర్తుతెలియని పదార్థం ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలింది. పేలుడు తీవ్రత చాలా ఎక్కువగా ఉండటంతో అనూప్ ప్రధాన్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. 50 మీటర్ల దూరం వరకు ఎగిరిపడ్డా మృతుడి శరీర భాగాలు.. పేలుడు ప్రభావం తీవ్రంగా ఉండటంతో మృతుడి శరీర భాగాలు సుమారు 50 మీటర్ల దూరం వరకు ఎగిరిపడ్డాయి. చేతులు, కాళ్లు తునాతునకలైపోవడంతో ఘటన స్థలం భయానకంగా మారింది. ఈ దృశ్యాలను చూసిన స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే మీర్‌పేట్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం మృతదేహ అవశేషాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలంలో ఆధారాలు సేకరించిన పోలీసులు పేలుడుకు కారణమైన పదార్థం ఏమిటన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం పేలుడు ప్రమాదవశాత్తు జరిగిందా, లేక చెత్త కుప్పలో పేలుడు పదార్థం ఉండటమే కారణమా అనే కోణాల్లో విచారణ చేపట్టారు. అవసరమైతే

ర గ ర డ డ జ ల ల ల ప ల డ క ర మ క డ మ త Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in