రవితేజ లైనప్ మామూలుగా లేదు.. లైన్ లోకి 'సింగం' డైరెక్టర్
Actor ProfileActor

రవితేజ లైనప్ మామూలుగా లేదు.. లైన్ లోకి 'సింగం' డైరెక్టర్

Total News1
Movie Updates0
Sources1
రవితేజ లైనప్ మామూలుగా లేదు.. లైన్ లోకి 'సింగం' డైరెక్టర్
Chitrajyothy16 Jun 2026
రవితేజ లైనప్ మామూలుగా లేదు.. లైన్ లోకి 'సింగం' డైరెక్టర్

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం ‘ఇరుముడి’ చిత్రంతో బిజీగా ఉండగా, దిల్ రాజు నిర్మాణంలో కొత్త సినిమా, వివేక్ ఆత్రేయతో ప్రాజెక్ట్, డైరెక్టర్ హరితో మాస్ ఎంటర్‌టైనర్, మారుతితో మరో సినిమా వంటి క్రేజీ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టినట్లు సమాచారం. మాస్ మహారాజా రవితేజ (Ravi Teja)కు ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన శైలి ఉంది. ఆయన సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా, హిట్టూ ఫ్లాపులను అస్సలు తలకెక్కించుకోరు. ఫైనల్ రిజల్ట్ గురించి ఎలాంటి ఒత్తిడి తీసుకోకుండా, నిరంతరం వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లడమే ఆయన పనిగా పెట్టుకుంటారు. 'ధమాకా' సినిమా తర్వాత రవితేజకు ఆశించిన స్థాయిలో సాలిడ్ హిట్ పడకపోయినప్పటికీ, ఆయన సినిమాల వేగం మాత్రం ఎక్కడా తగ్గలేదు. ప్రస్తుతం ఆయన శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఇరుముడి’(Irumudi) అనే సినిమా చేస్తున్నారు. తండ్రీ కూతుర్ల మధ్య సాగే ఎమోషనల్ అండ్ హార్ట్ టచింగ్ బంధం నేపథ్యంలో ఈ కథ తెరకెక్కుతోంది. ఈ సినిమాతో మాస్ మహారాజా ఖచ్చితంగా ఒక బలమైన కమ్‌బ్యాక్ ఇస్తారని ఆయన అభిమానులు ఎంతో నమ్మకంతో ఎదురుచూస్తున్నారు. ‘ఇరుముడి’ చిత్రం సెట్స్‌పై ఉండగానే రవితేజ తన తదుపరి లైనప్‌ను చాలా బలంగా సెట్ చేసుకున్నారు. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు (Dil Raju) బ్యానర్‌లో ఒక సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రం ద్వారా ఒక సరికొత్త దర్శకుడు టాలీవుడ్‌కి పరిచయం కానుండటం విశేషం. ఈ సినిమా కథ చాలా అద్భుతంగా వచ్చిందని, పైగా దిల్ రాజు నిర్మాణ విలువలు తోడవుతుండటంతో బాక్సాఫీస్ వద్ద మినిమం గ్యారెంటీ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఈ ప్రాజెక్ట్ తర్వాత వైవిధ్యమైన చిత్రాల దర్శకుడు వివేక్ ఆత్రేయ కూడా రవితేజ కోసం లైన్‌లో ఉన్నాడు. వివేక్ ఆత్రేయ (Vivek Athreya) మార్క్ కథలన్నీ చాలా సెన్సిటివ్‌గా, మంచి వినోదభరితంగా సాగుతాయి. కాబట్టి ఈ కాంబినేషన్ ద్వారా రవితేజను ఒక సరికొత్త విభిన్నమైన పాత్రలో