రమణ గోగులకు పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు
Actor ProfilePolitician

రమణ గోగులకు పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు

Total News1
Movie Updates0
Sources1
రమణ గోగులకు పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు
Chitrajyothy13 Jun 2026
రమణ గోగులకు పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు

సంగీత దర్శకుడు రమణ గోగులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌. సంగీత దర్శకుడు రమణ గోగులకు (Ramana Gogula) పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌(Pawan Kalyan). ఈ మేరకు ఓ నోట్‌ను విడుదల చేశారు. ‘నేను నటించిన ‘తమ్ముడు’, ‘బద్రి’ సినిమాలకు రమణ అందించిన బాణీలు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి. ఆ బాణీలలోని కొత్తదనం యువతను ఆకట్టుకొంది. ఆ గానంలోని విభిన్న శైలి ఆయనకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చింది. ఐ.ఐ.టి. ఖరగ్‌ పూర్‌ లో ఎం.టెక్‌ చదివి, అమెరికాలో ఎమ్మెస్‌ చేసిన విద్యావంతుడు రమణ గోగుల ఓ వైపు సినీ రంగంలో తన సృజనాత్మకతను చాటుతూనే వెంచర్‌ క్యాపటలిస్టుగా, టెక్నాలజీ సంస్థల నిర్వాహకుడిగా రాణిస్తున్న రమణ గోగులకు సంపూర్ణ ఆయురారోగ్యాలతో సంతోషాన్ని అందించాలని భగవంతుణ్ణి కోరుకొంటున్నాను’ అని పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు