రణ్ వీర్ సింగ్ రెడీ.. ఆస్ట్రేలియాలో షురూ
Actor ProfileActor

రణ్ వీర్ సింగ్ రెడీ.. ఆస్ట్రేలియాలో షురూ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రణ్ వీర్ సింగ్ రెడీ.. ఆస్ట్రేలియాలో షురూ
Chitrajyothy21 Aug 2026
రణ్ వీర్ సింగ్ రెడీ.. ఆస్ట్రేలియాలో షురూ

‘ధురంధర్‌’ చిత్రాల సక్సెస్‌ తర్వాత బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ‘ధురంధర్‌’ చిత్రాల సక్సెస్‌ తర్వాత బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దాదాపు రూ.300 కోట్లకు పైగా బడ్జెట్‌తో ఆయన నటిస్తున్న చిత్రం ‘ప్రళయ్‌’. జయ్‌ మెహతా దర్శకుడు. సెప్టెంబర్‌ నుంచి సెట్స్‌ మీదకెళ్లనుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్‌ పనులు షురూ అయ్యాయి. తాజా సమాచారం ప్రకారం ఈచిత్రం షూటింగ్‌ ఆస్ట్రేలియాలో మొదలుకానుందట. జాంబీల విజృంభణతో మానవ జాతిని అంతమొందే పరిస్థితుల నుంచి రక్షించడానికి ఓ జంట ఎలా పోరాటం చేసిందనే ఇతివృత్తంతో ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం రణ్‌వీర్‌ కథకు కావలసిన బాడీ ఫిట్‌నెస్‌ కోసం కసరత్తులు చేస్తున్నారు. ఈ సినిమాకు అంతర్జాతీయ చిత్రాలకు పనిచేసే టెక్నీషియన్లు పని చేస్తున్నారు. భారీ స్థాయిలో విజువల్‌ ఎఫెక్ట్‌ ఉపయోగించనున్నారట. దర్శకుడు జయ్‌ మెహతా మాట్లాడుతూ, ‘భారతీయ సినిమా ఇప్పటివరకు చేయని, ప్రేక్షకులు ఇప్పటివరకు చూడని స్థాయిలో జాంబీ చిత్రంగా ‘ప్రళయ్‌’ను రూపొందిస్తున్నాం’’ అని తెలిపారు