రణబాలి’.. 6 నెలలు గుర్రపు స్వారీ శిక్షణ తీసుకున్న విజయ్
Actor ProfileActor

రణబాలి’.. 6 నెలలు గుర్రపు స్వారీ శిక్షణ తీసుకున్న విజయ్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రణబాలి’.. 6 నెలలు గుర్రపు స్వారీ శిక్షణ తీసుకున్న విజయ్
Eenadu22 Aug 2026
రణబాలి’.. 6 నెలలు గుర్రపు స్వారీ శిక్షణ తీసుకున్న విజయ్

ఇంటర్నెట్‌ డెస్క్‌: హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), నటి రష్మిక (Rashmika Mandanna) జంటగా నటిస్తున్న చిత్రం ‘రణబాలి’ (Ranabaali). ఈ సినిమాకు రాహుల్‌ సాంకృత్యాన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. వివాహం తర్వాత విజయ్‌-రష్మిక కలిసి నటిస్తున్న తొలి చిత్రమిదే. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాల కోసం విజయ్‌ ఆరు నెలలు గుర్రపు స్వారీ శిక్షణ తీసుకున్నట్లు సమాచారం. బేసిక్స్ నుంచి మొదలుపెట్టి, ఒకే చేత్తో గుర్రం నడపడం, అతివేగంతో పరుగెత్తడం, యాక్షన్‌ సీన్లలో గుర్రాన్ని పూర్తిగా కంట్రోల్లో ఉంచడం వరకు నేర్చుకున్నాడని తెలుస్తోంది. కెమెరా ట్రిక్స్‌పై ఆధారపడకుండా స్వయంగా గుర్రపు స్వారీ నేర్చుకోవాలని విజయ్‌ భావించినట్లు సమాచారం. 1854 - 1878 మధ్యకాలంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా, ‘రణబాలి’ తెరకెక్కుతోంది. ఈ మూవీలో ‘ది మమ్మీ’ ఫేమ్ ఆర్నాల్డ్ వోస్లో (Arnold Vosloo) కీలక పాత్ర పోషిస్తున్నాడు. సెప్టెంబర్‌ 11న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఇక, ఈ సినిమా తర్వాత రవి కిరణ్ కోలా దర్శకత్వంలో ‘రౌడీ జనార్ధన’లో విజయ్ నటించనున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ యాక్షన్ డ్రామా డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే, ‘హాయ్ నాన్న’ దర్శకుడు శౌర్యువ్‌తో ‘VDxShouryuv’ అనే తాత్కాలిక టైటిల్‌తో విజయ్‌ కొత్త ప్రాజెక్ట్ ప్రకటించాడు. ఇందులో కృతి సనన్ హీరోయిన్ అని టాక్ వినిపిస్తోంది. కానీ, అధికారికంగా దీనిపై ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర

రణబ ల 6 న లల గ ర రప స వ ర శ క షణ త స క న న వ జయ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in