రజనీతో నటించడం ప్రత్యేకం
Actor ProfileActor

రజనీతో నటించడం ప్రత్యేకం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రజనీతో నటించడం ప్రత్యేకం
Chitrajyothy31 Jul 2026
రజనీతో నటించడం ప్రత్యేకం

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో కలిసి వెండితెరను షేర్‌ చేసుకోవడం అనేది ప్రత్యేక అనుభూతి అని సీనియర్‌ నటి ఈశ్వరీ రావు తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో (Rajanikanth) కలిసి వెండితెరను షేర్‌ చేసుకోవడం అనేది ప్రత్యేక అనుభూతి అని, ఆ అవకాశం తనకు 28 యేళ్ళ తర్వాత దక్కిందని ప్రముఖ సీనియర్‌ నటి ఈశ్వరీ రావు (Easwari Rao) తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 1990లో వచ్చిన ‘కవిదై పాడుమ్‌ అలైగల్‌’ అనే చిత్రంతో వెండి తెరకు పరిచయమైన ఈశ్వరి రావు వైజయంతి. మాతృభాష తెలుగులో బాలు మహేంద్ర దర్శకత్వం వహించిన ‘రామన్‌ అబ్దుల్లా’ అనే చిత్రం ద్వారా క్రేజ్‌ సంపాదించుకున్నారు. ఆ తర్వాత ‘గురు పార్వై’, ‘సింహరాశి’, ‘సుందరి నీయుం సుందరన్‌ నానుం’ ‘అప్పు’ ‘కన్నత్తిల్‌ ముత్తమిట్టాల్‌’ వంటి చిత్రాల్లో నటించారు. దక్షిణాది పరిశ్రమలో 60కి పైగా చిత్రాల్లో నటించిన ఈశ్వరి రావు 28 సంవత్సరాలు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ‘రజనీకాంత్‌ ‘కాలా’ చిత్రంలో ఆయన భార్యగా నటించాను. వాస్తవానికి బాలుమహేంద్ర దర్శకత్వం వహించిన ‘నీంగల్‌ కేట్టవై’ సినిమాలో నేను నటించాల్సింది. కానీ, కొన్ని కారణాలతో ఆ అవకాశం చేజారిపోయింది. ఆ తర్వాత ఎలాగైనా రజనీ సరసన నటించాలని గట్టిగా అనుకున్నాను. ఆ అవకాశం ‘కాలా’ చిత్రంలో వరించింది. ఆయన సరసన నటించడం ఎంతో ప్రత్యేకం’ అని పేర్కొన్నారు