Record India Defence Production : దేశీయ రక్షణ రంగంలో భారతదేశం చారిత్రాత్మక మైలురాయిని అధిగమించింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆత్మనిర్భర భారత్ నినాదం సత్ఫలితాలను ఇస్తూ దేశ రక్షణ ఉత్పాదకతను మునుపెన్నడూ లేని స్థాయికి చేర్చింది. ఆర్థిక సంవత్సరం 2025-26లో భారత రక్షణ రంగ ఉత్పత్తి ఏకంగా రూ. 1.78 లక్షల కోట్ల ఆల్‌టైమ్ హై రికార్డును తాకినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరం (రూ. 1.54 లక్షల కోట్లు)తో పోలిస్తే 15.6 శాతం వృద్ధిని నమోదు చేయడమే కాకుండా.. 2020-21 నాటి గణాంకాలతో (రూ. 84,643 కోట్లు) పోల్చితే ఐదేళ్ల కాలంలోనే రెండింతలు కావడం విశేషం. గడిచిన దశాబ్ద కాలంలో దేశీయ రక్షణ తయారీ ఏకంగా నాలుగు రెట్లు పెరగడం గమనార్హం.ప్రైవేటు రంగానిదే కీలక పాత్ర..!ప్రస్తుత రక్షణ ఉత్పత్తుల్లో రక్షణ రంగ ప్రభుత్వ సంస్థలు, ఇతర ప్రభుత్వ విభాగాలు 76 శాతం వాటాను కలిగి ఉండగా.. ప్రైవేట్ రంగం తన భాగస్వామ్యాన్ని 24 శాతానికి పెంచుకుంది. ప్రైవేట్ రంగ రక్షణ ఉత్పత్తి రూ. 42,000 కోట్ల అత్యున్నత స్థాయికి చేరింది. ఈ భారీ దేశీయ తయారీ వల్ల భారత్ రక్షణ ఎగుమతుల్లోనూ సరికొత్త చరిత్ర సృష్టించింది. గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో రూ. 38,424 కోట్ల విలువైన ఆయుధాలు, సైనిక సామగ్రిని ఇతర దేశాలకు ఎగుమతి చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం, రక్షణ శాఖ తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాల వల్లే ఈ ఘనత సాధ్యమైందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కొనియాడారు. బడ్జెట్ 2026 లో రక్షణ రంగానికి కేటాయించిన రూ. 7.85 లక్షల కోట్లు (ఆధునికీకరణ కోసమే రూ. 2.19 లక్షల కోట్లు) ఈ రంగానికి మరింత ఊతాన్నిచ్చాయి.రాబోయే రోజుల్లో లక్షల కోట్ల విలువైన మెగా ప్రాజెక్టులు..భారత సైన్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు రానున్న రోజుల్లో అతిపెద్ద రక్షణ కొనుగోలు
Actor ProfilePolitician
రక్షణ రంగంలో భారత్ సరికొత్త రికార్డు.. రూ. 1.78 లక్షల కోట్లకు చేరిన ఉత్పాదకత.. ఐదేళ్లలోనే రెట్టింపు
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•17 Jun 2026
రక్షణ రంగంలో భారత్ సరికొత్త రికార్డు.. రూ. 1.78 లక్షల కోట్లకు చేరిన ఉత్పాదకత.. ఐదేళ్లలోనే రెట్టింపు