
ఈ నెలాఖరు వరకు రైతువేదికల్లో విత్తన మేళాలు యూరియా యాప్‌పై అవగాహన (ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి) సన్నరకం వరి సాగును ప్రోత్సహిస్తూ రైతు లకు బోనస్ అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఈ సీజన్ నుంచి ఏడు రకాల సన్నాలను సాగు చేస్తేనే బోనస్ చెల్లిస్తామని ప్రకటించింది. ఈ విషయమై ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నప్పటికీ, రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం విత్తన మేళా కార్యక్రమాలను నిర్వహిస్తూ ముందుకు వెళుతున్నది. గతంలో 33రకాల సన్న రకం ధాన్యానికి బోనస్ చెల్లించగా, ప్రస్తుతం ఏడు రకాలకే పరిమితం చేసింది. అధిక దిగు బడులు ఇచ్చే, బహిరంగ మార్కెట్లో డిమాండ్ ఉన్న రకాల సాగును ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో రైతులకు అవగాహన కల్పించేందుకు మంగళవారం నుంచి రైతు వేదికల ద్వారా విత్తన మేళాలను నిర్వహిస్తున్నారు. ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగే ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొని రైతులకు సూచనలు చేస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన రకాలనే సాగు చేస్తే క్వింటాలుకు రూ.500 బోనస్ అందుతుందని వివరిస్తున్నారు. ఏడు రకాలకే ప్రాధాన్యం బీపీటీ- 5204, ఆర్‌ఎన్‌ఆర్-15048, కేఎన్‌ఎం-1638, జైశ్రీరామ్, హెచ్‌ఎంటీ సోనా, వరంగల్-44, కేఎన్‌ఎం- 7715 రకాల సన్న ధాన్యానికే ఈ సీజన్‌లో బోనస్ వర్తించనుంది. ఈ రకాలకే మార్కెట్లో డిమాండ్ ఉండటంతో పాటు అధిక దిగుబడులు సాధ్యమవుతా యని అధికారులు చెబుతున్నారు. దీంతో ఇప్పటికే పలువురు రైతులు ఆయా రకాల విత్త్తనాల సేక రణలో నిమగ్నమయ్యారు. కొందరు రైతులు వరి నార్లు కూడా పోశారు. జిల్లాలో ఈ వానాకాలం సీజన్‌లో సుమారు 2.76 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు కానున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అందులో అత్యధికంగా 2.15 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయ నున్నట్లు అధికారులు పేర్కొం టున్నారు. ముఖ్యంగా ఎస్సారెస్పీ నీటితో సాగయ్యే ప్రాంతాల్లో రైతులు సన్న రకం వరి
