
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) యువ ప్రతిభను ఆకర్షించేందుకు ‘యంగ్ ప్రొఫెషనల్స్ (YP)’ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆర్థిక వ్యవస్థ, పబ్లిక్ పాలసీ, డేటా విశ్లేషణ, సాంకేతిక రంగాల్లో నైపుణ్యం కలిగిన యువతకు అరుదైన అవకాశం కల్పిస్తోంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.1.5 లక్షల స్థిర స్టైఫండ్ లభించనుండగా, నియామకం ఒప్పంద ప్రాతిపదికన ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపికైన వారు ముంబైలోని ఆర్బీఐ సెంట్రల్ ఆఫీస్‌లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఆర్బీఐ ప్రణాళిక ప్రకారం ప్రారంభంలో మూడేళ్ల కాలానికి నియామకం చేపడతారు. పనితీరు, పరస్పర అంగీకారం ఆధారంగా ఈ గడువును గరిష్ఠంగా ఐదేళ్ల వరకు పొడిగించే అవకాశం ఉంది. అయితే ఈ నియామకం శాశ్వత ఉద్యోగానికి హామీ కాదని ఆర్బీఐ స్పష్టం చేసింది. కానీ, ఎంపికైన అభ్యర్థులు ఫుల్ టైమ్ ఉద్యోగులుగా పనిచేయాల్సి ఉంటుంది. బ్యాంక్ అనుమతి లేకుండా ఇతర ఉద్యోగాలు లేదా కన్సల్టెన్సీ పనులు చేపట్టరాదు. ఎంపికైన యంగ్ ప్రొఫెషనల్స్‌కు నెలకు రూ.1,50,000 స్థిర స్టైఫండ్ చెల్లిస్తారు. దీనిపై వర్తించే ఆదాయపన్ను మినహాయింపులు అమల్లో ఉంటాయి. స్టైఫండ్‌కు అదనంగా ఇతర అలవెన్సులు, హెచ్‌ఆర్‌ఏ లేదా ప్రోత్సాహకాలు ఉండవని నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు. అభ్యర్థుల ఎంపిక వివిధ దశల్లో జరుగుతుంది. ముందుగా దరఖాస్తుల పరిశీలన, షార్ట్‌లిస్టింగ్ నిర్వహించి, అనంతరం డాక్యుమెంట్ వెరిఫికేషన్, వ్యక్తిగత ఇంటర్వ్యూలు చేపడతారు. ఖాళీల సంఖ్య, దరఖాస్తుల నాణ్యత ఆధారంగా ఇంటర్వ్యూకు పిలిచే అభ్యర్థుల సంఖ్యను పరిమితం చేసే అధికారం ఆర్బీఐకి ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తు ఫారం, సీవీ, విద్యార్హత సర్టిఫికెట్లు, స్టేట్‌మెంట్ ఆఫ్ ఇంటరెస్ట్, రైటింగ్ శాంపిల్, రిఫరెన్స్ లెటర్‌తో కలిసి ఈ-మెయిల్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి. “YP Application – Post Code – Candidate Name” అనే సబ్జెక్ట్ లైన్‌తో [yphrmdco@rbi.org.in](mailto:yphrmdco@rbi.org.in) కు దరఖాస్తులు పంపాలి. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసే వారు ప్రతి పోస్టుకు