యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2026 ఫలితాలు విడుదల
Actor ProfilePolitician

యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2026 ఫలితాలు విడుదల

Total News2
Movie Updates0
Sources1
ప్రధాని మోదీకి స్లొవేకియా అత్యున్నత పురస్కారం
Vaartha16 Jun 2026
ప్రధాని మోదీకి స్లొవేకియా అత్యున్నత పురస్కారం

‘The Order of the White Double Cross‘ : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంతర్జాతీయంగా మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. స్లొవేకియా దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘ది ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్

యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2026 ఫలితాలు విడుదల
Vaartha16 Jun 2026
యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2026 ఫలితాలు విడుదల

UPSC Prelims 2026 Results: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్ష – 2026 ఫలితాలు సోమవారం (జూన్ 15) రాత్రి వెలువడ్డాయి. ఈ పరీక్షలో ప్రతిభ చాటి, తదుపరి దశ అయిన ‘మెయిన్స్’ పరీక్షకు దేశవ్యాప్తంగా మొత్తం 13,343 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. సివిల్స్ ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయిన అభ్యర్థుల రోల్ నంబర్ల జాబితాను కమిషన్ తన అధికారిక వెబ్‌సైట్ (upsc.gov.in) లో పొందుపరిచింది. ఈ ఏడాది మొత్తం 1,016 సివిల్ సర్వీసెస్ పోస్టుల భర్తీ కోసం యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే మే 24న దేశవ్యాప్తంగా ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించారు. కాగా, గతేడాది (2025లో) 1,087 ఖాళీల భర్తీ ప్రక్రియ చేపట్టగా.. అప్పట్లో 14,161 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు ఎంపికయ్యారు. read also: Drogo Aerospace: భారత సైన్యానికి 41 అత్యాధునిక ‘జేకే 250ఈ’ డ్రోన్లను అందించిన హైదరాబాద్ సంస్థ ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు తదుపరి దశకు వెళ్లడానికి విధిగా డిటైల్డ్ అప్లికేషన్ ఫామ్ (DAF-I) సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులకు వచ్చిన వ్యక్తిగత మార్కులు, కేటగిరీల వారీగా కటాఫ్ వివరాలు మరియు ఆన్సర్ కీ (Answer Key)లను ఇప్పుడు ప్రకటించలేదు. సివిల్ సర్వీసెస్ 2026 తుది ఫలితాలు (Final Results) పూర్తిగా వెలువడిన తర్వాతే వీటిని యూపీఎస్సీ విడుదల చేస్తుంది. అభ్యర్థులకు ఏవైనా సందేహాలు ఉంటే కమిషన్ ఏర్పాటు చేసిన కాల్ సెంటర్‌ను సంప్రదించవచ్చు. Today Rasi Phalalu : రాశి ఫలాలు – 16 జూన్ 2026 గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. Drogo Aerospace: భారత సైన్యానికి 41 అత్యాధునిక