
యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల. మెయిన్స్ పరీక్షకు 13,343 మంది ఎంపిక. ఆగస్టు 21 నుండి మెయిన్స్ పరీక్షలు. UPSC Prelims Results 2026: కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ఉద్యోగాల భర్తీకి సంబంధించిన 'యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ 2026' ఫలితాలను కమిషన్ అధికారికంగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా దాదాపు 5.49 లక్షల మంది పోటీపడిన ఈ ప్రాథమిక ఫిల్టరేషన్ పరీక్షలో కేవలం 13,343 మంది అభ్యర్థులు మాత్రమే తదుపరి దశకు ఎంపికయ్యారు. మే 24న నిర్వహించిన ఈ పరీక్షా ఫలితాలను ఎప్పటికప్పుడు వేగంగా ఇచ్చే ట్రెండ్‌ను కొనసాగిస్తూ యూపీఎస్సీ కేవలం 17 రోజుల్లోనే విడుదల చేయడం విశేషం. దీని ద్వారా సివిల్స్, ఐఎఫ్ఎస్ విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేయనున్నారు అధికారులు. UPSC ప్రిలిమ్స్ 2026 సెలక్షన్ లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఇక, ప్రస్తుతం విడుదల చేసిన జాబితాలో కేవలం అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థుల వ్యక్తిగత స్కోర్లు, కట్-ఆఫ్ వివరాలు, ఫైనల్ కీలను రిక్రూట్మెంట్ ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాతే వెల్లడిస్తామని బోర్డు స్పష్టం చేసింది. ప్రిలిమ్స్ అనేది కేవలం స్క్రీనింగ్ పరీక్ష మాత్రమే కాబట్టి, ఇందులో వచ్చే మార్కులను తుది మెరిట్ లిస్ట్ తయారీలో పరిగణనలోకి తీసుకోరు. ఫారెస్ట్ సర్వీసెస్ అభ్యర్థుల జాబితాను కూడా పేర్లతో సహా కమిషన్ ప్రదర్శించింది. ప్రిలిమ్స్(UPSC Prelims Results 2026) గండం గట్టెక్కిన అభ్యర్థులకు అసలైన సవాలు అయిన మెయిన్స్ పరీక్షలు 2026 ఆగస్టు 21 నుండి ప్రారంభం కానున్నాయి. అభ్యర్థుల యొక్క తుది సర్వీస్ కేటాయింపు మరియు ర్యాంకులను నిర్ణయించడంలో మెయిన్స్ పరీక్షలో సాధించే మార్కులే అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తాయి. ఈ రాత పరీక్షలో మెరుగైన ప్రతిభ కనబరిచిన వారిని చివరి దశ అయిన పర్సనల్ ఇంటర్వ్యూకి పిలుస్తారు. విజేతలుగా నిలిచిన వారికే దేశంలోనే అత్యున్నతమైన ఐఏఎస్, ఐపీఎస్ వంటి సర్వీసులు దక్కుతాయి