యుద్ధంతో ప్రయోజనమే లేదు
Actor ProfilePolitician

యుద్ధంతో ప్రయోజనమే లేదు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
యుద్ధంతో ప్రయోజనమే లేదు
Sakshi17 Jul 2026
యుద్ధంతో ప్రయోజనమే లేదు

ఇరాన్‌తో అమెరికా మధ్యంతర శాంతి ఒప్పందం అమల్లోకి వచ్చింది. యుద్ధ సమయంలో ఓడరేవులపై విధించిన అమెరికా నావికా దిగ్బంధనాన్ని ఇరాన్‌ ముగించింది. దీంతో హార్మూజ్‌ జలసంధి తెరుచుకుంది. ఇరు దేశాలు శాశ్వత శాంతి కోసం కృషి చేస్తున్నాయి. ఇంతా చేసి ఈ నాలుగు నెలల యుద్ధంలో అమెరికా సాధించిందేమిటి? అగ్ర రాజ్యానికి 40 బిలియన్‌ డాలర్ల నష్టం మిగిల్చిన ఈ యుద్ధానికి తగిన ఫలితం వచ్చిందా? ఇదే విషయంపై రాయిటర్స్‌/ఇప్సోస్‌ జూన్‌ 18–22 మధ్య అమెరికాలో సర్వే నిర్వహించింది. ఇంతా చేస్తే అసలు ఈ సంఘర్షణకు విలువే లేదంటున్నారు సర్వేలో పాల్గొన్న సగం మంది అమెరికన్లు. యుద్ధానికి అయిన ఖర్చుకు తగిన ఫలితం సాధించిందని పావు వంతు అమెరికన్లు మాత్రమే నమ్ముతున్నారు. మరో పావు వంతు మాత్రం ఏమీ చెప్పలేమంటున్నారు. అమెరికా అగ్రరాజ్యం అంటే... ప్రపంచానికి పెద్దన్న పాత్ర. అలాంటి దేశానికి అధ్యక్షుడంటే ఎంతటి ప్రజామోదం ఉండాలి. కానీ.. యుద్ధ కాంక్షతో ఉన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రజాదరణ తగ్గింది. రెండో పదవీకాలంలో అత్యల్ప స్థాయికి వచ్చింది. ఆయన ఆమోద రేటింగ్‌ 34%కి పడిపోయింది. ఇక, ప్రజల జీవన వ్యయంపై ట్రంప్‌కు ఆమోదం 22 శాతంగా ఉంది, ఇది ఆయన అధ్యక్ష పదవీకాలంలోనే అత్యల్ప స్థాయి. అంతేకాక, వైట్‌హౌస్‌లో ఆయనకు ముందున్న డెమొక్రటిక్‌ అధ్యక్షుడు జో బైడెన్‌ తన అధ్యక్ష పదవీకాలం చివరిలో పొందిన రేటింగ్‌ కంటే కూడా ఇది తక్కువ. బలహీన స్థితిలో అమెరికా ఇరాన్‌పై దాడులకు ఆదేశించడానికి ముందు ఉన్న దానికంటే అమెరికా ఇప్పుడు మరింత బలహీనమైన స్థితిలో ఉందని 35% మంది అమెరికన్లు అభిప్రాయపడ్డారు. అయితే, యుద్ధానికి ముందుతో పోలిస్తే ఇప్పుడు ఇరాన్‌తో అమెరికా మరింత బలమైన స్థితిలో ఉందని కేవలం 23% మంది అమెరికన్లు మాతమ్రే నమ్ముతున్నారు. వీరిలో ట్రంప్‌ సొంత పార్టీ రిపబ్లికన్‌కి చెందినవారు సగం మంది మాత్రమే ఉండటం గమనార్హం. శాంతి ఒప్పందం నిలవదు

య ద ధ త ప రయ జనమ ల ద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in