యూజర్ నేమ్ ఫీచర్ .. టెలిగ్రామ్
Actor ProfilePolitician

యూజర్ నేమ్ ఫీచర్ .. టెలిగ్రామ్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
యూజర్ నేమ్ ఫీచర్ .. టెలిగ్రామ్ , సిగ్నల్ కు కేంద్రం నోటీసులు
Eenadu5 Sept 2026
యూజర్ నేమ్ ఫీచర్ .. టెలిగ్రామ్ , సిగ్నల్ కు కేంద్రం నోటీసులు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆన్‌లైన్‌ మెసేజింగ్‌ యాప్‌లలో భద్రతపై దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం.. ‘యూజర్‌నేమ్‌ ఫీచర్‌’పై వివరణ ఇవ్వాలని వాట్సప్‌నకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా టెలిగ్రామ్‌, సిగ్నల్‌ యాప్‌లకూ కేంద్రం నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది. తమ ‘యూజర్‌నేమ్’ ఫీచర్‌ గురించి వివరణ ఇవ్వాలని ఆ రెండు ప్లాట్‌ఫామ్‌లను కోరినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మోసాలు, నకిలీ గుర్తింపు ధ్రువీకరణలకు సంబంధించి తీసుకుంటున్న రక్షణ చర్యలను వివరించాలని కోరింది.యూజర్‌నేమ్‌తో ఖాతా వల్ల.. నకిలీ గుర్తింపు ధ్రువీకరణలు పెరిగి, మోసాలు అధికమవుతాయనే ఆందోళనలు నెలకొన్నాయి. ప్రముఖ సంస్థలు, వ్యక్తులను పోలిన పేర్లతో యూజర్‌ నేమ్‌ తీసుకుని, అమాయకులకు మెసేజ్‌లు పంపి మోసగించే వీలుంటుందని అనుమానిస్తున్నారు. వీటివల్ల ఆర్థిక మోసాలూ అధికం కావచ్చన్నది ఆందోళన. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ఈపీఎఫ్ఓ రూల్స్‌ జులై 1 నుంచి అమల్లోకి వచ్చాయి