
– విద్యా హబ్‌గా మారనున్న కొత్తగూడెం జిల్లా కేంద్రం – రూ.200 కోట్లతో అత్యాధునిక హంగులతో యంగ్ ఇండియా స్కూల్ – కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం గణేష్ టెంపుల్, జూన్ 29 : ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఏర్పాటు కానున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కొత్తగూడెం నియోజకవర్గానికి ఒక కీర్తి పతాక అని, ఈ స్కూల్ ఏర్పాటుతో కొత్తగూడెం జిల్లా కేంద్రం గొప్ప విద్యా హబ్’గా మారబోతోందని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. నియోజకవర్గంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా కొనసాగుతున్న ‘యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాల’ నిర్మాణ పనులను సోమవారం అధికారులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, స్థానిక నేతలతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కులమతాలకతీతంగా అన్ని వర్గాల విద్యార్థులకూ ఒకే క్యాంపస్ లో విద్యను అందించాలనే ప్రభుత్వ ఆలోచన ఎంతో అభినందనీయమన్నారు. ఈ ప్రాజెక్టు కింద కొత్తగూడెం క్యాంపస్ లో రూ.200 కోట్ల అంచనా వ్యయంతో అత్యంత అత్యాధునిక హంగులతో ఈ స్కూల్ పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. 25.475 ఎకరాల భారీ విస్తీర్ణంలో, 5,38,246 చదరపు అడుగుల ప్లింత్ ఏరియాతో నిర్మిస్తున్న ఈ భారీ నిర్మాణాల్లో అకడమిక్ బ్లాక్, జూనియర్, సీనియర్ హాస్టల్ బ్లాకులు, డైనింగ్, కిచెన్ లతో పాటు సిబ్బంది కోసం క్వార్టర్లను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. వచ్చే విద్యాసంవత్సరం నాటికి ఈ సరికొత్త స్కూల్ ను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా నిర్దేశించుకొని పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఈ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధనతో పాటు డిజిటల్ స్మార్ట్ క్లాస్ రూమ్‌లు, కంప్యూటర్ సెంటర్లు, సైన్స్ ల్యాబ్‌లు, 5000 పైగా పుస్తకాలతో కూడిన డిజిటల్ లైబ్రరీలను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. విద్యార్థుల శారీరక, మానసిక వికాసం కోసం 200 మీటర్ల రన్నింగ్ ట్రాక్, క్రికెట్ గ్రౌండ్, వాలీబాల్, బాస్కెట్ బాల్, కబడ్డీ కోర్టులను ప్రత్యేకంగా నిర్మిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా, పర్యావరణ