యూఎన్ హాబిటాట్ తో ఏపీ భాగస్వామ్యం.. సీఎం చంద్రబాబు కీలక భేటీ
Actor ProfilePolitician

యూఎన్ హాబిటాట్ తో ఏపీ భాగస్వామ్యం.. సీఎం చంద్రబాబు కీలక భేటీ

Total News1
Movie Updates0
Sources1
యూఎన్ హాబిటాట్ తో ఏపీ భాగస్వామ్యం.. సీఎం చంద్రబాబు కీలక భేటీ
Andhra Jyothy15 Jun 2026
యూఎన్ హాబిటాట్ తో ఏపీ భాగస్వామ్యం.. సీఎం చంద్రబాబు కీలక భేటీ

ఏపీకి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా సింగపూర్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా యూఎన్ హాబిటాట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనాక్లాడియా రోస్‌బాక్‌తో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. అమరావతి, జూన్ 15: ఏపీకి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా సింగపూర్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా యూఎన్ హాబిటాట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనాక్లాడియా రోస్‌బాక్‌తో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. రాష్ట్రంలో యూఎన్ హాబిటాట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ ఏర్పాటు చేయాలని, దీనికి భూమి కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా సీఎం వెల్లడించారు. యూఎన్ హాబిటాట్‌తో సంపూర్ణ భాగస్వామ్యం కోరుకుంటున్నామని అన్నారు. ఇందుకు యూఎన్ హాబిటాట్ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. విశ్వవిద్యాలయాల మధ్య భాగస్వామ్యం, ప్రణాళిక దశలో ఎస్డీజీలను చేర్చడం, ప్రొఫెషనల్స్ నెట్‌వర్క్ సహకారంపైనా చర్చించారు. 2028 నాటికి లక్ష్యాలను చేరుకునేలా కార్యాచరణ కోసం ఎంవోయూ ద్వారా టైమ్‌లైన్ ఉండాలని సీఎం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పట్టణాల సుస్థిర అభివృద్ధికి యూఎన్ హాబిటాట్ సహకారం కోరారు. వాతావరణ మార్పుల నుంచి తీరప్రాంత నగరాలను రక్షించడానికి ఉద్దేశించిన ‘రైజప్’ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేయాలని ప్రతిపాదించారు. పట్టణాల్లో మురికివాడల అభివృద్ధికి పార్టిసిపేటరీ స్లమ్ అప్‌గ్రేడింగ్ ప్రోగ్రాం(PSUP) అమలుపై చర్చించారు. ఏపీలో వేగంగా అభివృద్ధి చెందుతున్న మధ్యస్థాయి నగరాల్లో అర్బన్ రాస్తా ఫ్రేమ్ వర్క్‌ను సంయుక్తంగా అమలు చేయాలని సీఎం ప్రతిపాదించారు. మున్సిపల్ ఆర్థిక వ్యవస్థ బలోపేతం - స్థానిక ఆదాయ వనరులను పెంచేందుకు వాల్యూ కాప్చర్ ఫైనాన్సింగ్ వంటి పద్ధతులను ప్రవేశపెట్టడం, అంతర్జాతీయ వాతావరణ నిధుల సమీకరణ తదితర అంశాలపైనా ఈ సమావేశంలో చర్చ జరిగింది. మోదీ నాయకత్వంలో భారత్ దూసుకుపోతోంది: సీఎం చంద్రబాబు తెలంగాణ విభజనకు ఏనాడూ జనసేన అడ్డు చెప్పలేదు: పవన్ కల్యాణ్