
డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా ఫిఫా ప్రపంచకప్ 2026ను ఘనంగా ప్రారంభించింది. గ్రూప్-జెలో భాగంగా బుధవారం అర్జెంటీనా జట్టు 3-0తో అల్జీరియాను చిత్తు చేసింది. 200వ మ్యాచ్ ఆడుతున్న అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ హ్యాట్రిక్ గోల్స్ (ఆట 17వ, 60వ, 76వ నిమిషం)తో మెరిశాడు. తద్వారా ఫిఫా చరిత్రలో అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాళ్ల జాబితాలో జర్మనీ దిగ్గజం మిరాస్లోవ్ క్లోజ్‌తో కలిసి మెస్సీ సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. ఈ విజయంతో అర్జెంటీనా మూడు పాయింట్లు సాధించి పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. రికార్డు స్థాయిలో ఆరో ఫిఫా ప్రపంచకప్ ఆడుతున్న మెస్సీకి ఇది 200వ అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. మ్యాచ్ ఆరంభం నుంచే హైపర్ యాక్టివ్‌గా కనిపించిన మెస్సీ 38 ఏళ్ల వయసులోనూ మైదానంలో పాదరసంలా పరిగెత్తాడు. 17వ నిమిషంలో ఆఫ్‌సైడ్ దిశగా వచ్చిన బంతిని మెస్సీ నేరుగా గోల్ పోస్ట్‌లోకి తరలించడంతో అర్జెంటీనా ఖాతా తెరిచింది. ఆ తర్వాత ఆట 60వ నిమిషంలో మెస్సీ మరోసారి మెరిశాడు. ఈసారి రైట్ కార్నర్ నుంచి బంతిని గోల్ పోస్ట్‌లోకి తరలించి అర్జెంటీనా ఆధిక్యాన్ని రెండుకు పెంచాడు. అయితే ఆట 69వ నిమిషంలో అల్జీరియా గోల్ కొట్టే అవకాశాన్ని మిస్ చేసుకుంది. బంతిని అందుకున్న హౌసమ్ ఆర్ ఎడ్జ్ ఆఫ్ ఏరియా దిశగా బంతిని తలరించాడు. కానీ అర్జెంటీనా గోల్ కీపర్ బంతిని సమర్థంగా అడ్డుకోవడంతో బంతి గోల్‌పోస్ట్ పక్క నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత 76వ నిమిషంలో మరో గోల్ కొట్టిన మెస్సీ హ్యాట్రిక్ గోల్స్‌తో రికార్డు సృష్టించాడు. మరోవైపు అల్జీరియా మాత్రం అర్జెంటీనా ముందు ఏమాత్రం నిలవలేకపోయింది. గచ్చిబౌలి స్టేడియంలో రగ్బీ సందడి..శ్రుతి హాసన్ ఆటా.. పాట (ఫోటోలు) వడ్డే నవీన్ ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫోటోలు) బర్త్ డే స్పెషల్.. లంగా ఓణీలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు) ఫ్యామిలీతో కలిసి ప్రణీత మాల్దీవులు ట్రిప్ (ఫొటోలు) జాగ్రత్తగా