
అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సిద్ధమవడంతో పోలీసులు ఆయనను గృహ నిర్బంధం చేశారు


అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సిద్ధమవడంతో పోలీసులు ఆయనను గృహ నిర్బంధం చేశారు

మోహర్రం పర్వదినం నేడు. ఈ నేపథ్యంలో ముస్లిం సోదరులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మోహర్రం పండగ శుభాకాంక్షలు తెలిపారు. అమరావతి, జూన్ 26: మోహర్రం పర్వదినం నేడు. ఈ నేపథ్యంలో ముస్లిం సోదరులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మోహర్రం పండగ శుభాకాంక్షలు తెలిపారు. ‘ఎన్ని కష్టాలు ఎదురైనా సత్య మార్గంలో నడవాలనే స్ఫూర్తిని మనకు మొహర్రం అందిస్తుంది. మోహర్రం అంటేనే త్యాగం. సత్యం, న్యాయం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన ఇమామ్ హుస్సేన్ త్యాగాన్ని మొహర్రం సందర్భంగా స్మరించుకుందాం. మోహర్రం అందరికి శాంతిని తీసుకురావాలని, ధర్మ మార్గాన్ని చూపాలని కోరుకుంటున్నాను’ అని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. శాంతి, సామరస్యాల ప్రతీకగా మొహర్రం: లోకేశ్ హజ్రత్ హుస్సేన్ మహనీయుని అమరత్వం, త్యాగాన్ని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు స్మరించుకునే సందర్బం మొహర్రం అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. త్యాగం, సహనంతో ధర్మ పరిరక్షణ కోసం పాటుపడటమే మొహర్రం మనకు ఇచ్చే సందేశమని చెప్పారు. అల్లాహ్ దీవెనలతో శాంతి, సామరస్యాల ప్రతీకగా మొహర్రం జరగాలని ఆకాంక్షిస్తున్నాను అని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. వైసీపీ రాక్షస పాలనలో కష్టాల కడలిలో ప్రజలు