
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ నది అభివృద్ధి పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. అందులో భాగంగా నదీ పరీవాహక ప్రాంతంలో నివసిస్తున్న పేద కుటుంబాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టు కారణంగా వెళ్లిపోవాల్సి వచ్చే నిర్వాసితులందరికీ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు త్వరగా కేటాయించాలని అధికారులను ఆదేశించారు.ఉన్నతస్థాయి సమీక్షలో కీలక విషయాలు వెల్లడించిన సీఎంశుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం ఈ విషయాలన్నీ వివరంగా చర్చించారు. ప్రాజెక్టు వల్ల భూములు కోల్పోయే యజమానులకు ఎటువంటి నష్టం రాకుండా చూడాలని, వారి ఇష్టానికి తగ్గట్టు టీడీఆర్ ఇవ్వడం లేదా మార్కెట్ విలువ ప్రకారం తగిన ఆర్థిక పరిహారం చెల్లించడం జరుగుతుందని స్పష్టం చేశారు. భూసేకరణ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, ప్రజలు ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి చేయాలని నిర్దేశించారు.నెక్లెస్ రోడ్‌లో మూసీ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ఏర్పాటుమూసీ నదికి తిరిగి పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టు చేపట్టారు. దీని ద్వారా హైదరాబాద్ నగర రూపురేఖలు మార్చాలని ప్రయత్నం చేస్తుంది తెలంగాణా ప్రభుత్వం.. ప్రజలు ఈ ప్రాజెక్టు గురించి పూర్తి సమాచారం తెలుసుకుని, తమ అభిప్రాయాలు చెప్పేందుకు అవకాశం కల్పించాలని సీఎం భావిస్తున్నారు. దీని భాగంగా నెక్లెస్ రోడ్‌లో మూసీ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చారు.ప్రజల నుంచి సూచనలు, అభిప్రాయాలుఇక్కడ 3డి మోడల్స్, డిజిటల్ ప్రదర్శనల ద్వారా ప్రాజెక్టు వివరాలు చూపించి, ప్రజల నుంచి సూచనలు, అభిప్రాయాలు సేకరించనున్నారు. అదే సమయంలో గాంధీ సరోవర్ ప్రాజెక్టు పనులపై కూడా సమీక్ష చేశారు. కేంద్ర రక్షణ శాఖ నుంచి సేకరించే భూముల్లో ఉన్న మిలిటరీ నిర్మాణాలను తరలించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టాలని, ఎలాంటి ఆలస్యం లేకుండా పనులు పూర్తి చేయాలని సీఎం సూచించారు.నేను గుంపు మేస్త్రినే.. మరోమారు క్లారిటీ ఇచ్చిన రేవంత్.. వైరల్ వీడియో!హైదరాబాద్‌ను ప్రపంచ