మిషన్ గోదావరి క్లీన్ ప్రాజెక్టుకు కేంద్రం మద్దతు.. కాలుష్య అధ్యయనానికి కేంద్ర బృందం
Actor ProfilePolitician

మిషన్ గోదావరి క్లీన్ ప్రాజెక్టుకు కేంద్రం మద్దతు.. కాలుష్య అధ్యయనానికి కేంద్ర బృందం

Total News1
Movie Updates0
Sources1
మిషన్ గోదావరి క్లీన్ ప్రాజెక్టుకు కేంద్రం మద్దతు.. కాలుష్య అధ్యయనానికి కేంద్ర బృందం
NTV Telugu16 Jun 2026
మిషన్ గోదావరి క్లీన్ ప్రాజెక్టుకు కేంద్రం మద్దతు.. కాలుష్య అధ్యయనానికి కేంద్ర బృందం

Mission Godavari Clean Project: గోదావరి నది కాలుష్య నివారణకు చేపట్టిన "మిషన్ గోదావరి క్లీన్" ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరించేందుకు ముందుకు వచ్చిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్‌ తెలిపారు. గోదావరి నదిని మున్సిపల్, పారిశ్రామిక కాలుష్యం నుంచి రక్షించి స్వచ్ఛమైన నదీ వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) బృందాన్ని పంపేందుకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అంగీకరించిందని వెల్లడించారు. ఈ రోజు ఢిల్లీలో కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌తో సమావేశమైన అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖలకు సంబంధించిన ఎనిమిది కీలక అంశాలపై కేంద్ర మంత్రితో చర్చించినట్లు తెలిపారు. ఇటీవల అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్మించనున్న అరణ్యారామం కామన్ ఫెసిలిటీ సెంటర్‌కు అనుమతులు మంజూరు చేసినందుకు భూపేంద్ర యాదవ్‌కు కృతజ్ఞతలు తెలిపినట్లు చెప్పారు పవన్‌ కల్యాణ్‌.. నూతన అరణ్యం భవన్‌లో మానవ-వన్యప్రాణి సంఘర్షణ నివారణ కేంద్రం, హనుమాన్ మానిటరింగ్ సెంటర్, గ్రేట్ గ్రీన్ వాల్ పర్యవేక్షణ కేంద్రం, ఫారెస్ట్ ఫైర్ కమాండ్ కంట్రోల్ సెంటర్, స్టేట్ టైగర్ మానిటరింగ్ సెంటర్ వంటి ఆధునిక విభాగాలు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. అలాగే నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్‌లో ప్రస్తుతం ఉన్న 90 బేస్ క్యాంపులను 150కు పెంచేందుకు కేంద్రం సానుకూలంగా స్పందించిందని తెలిపారు. ఇందుకు అవసరమైన 300 మంది అదనపు అటవీ గార్డుల నియామకం, బేస్ క్యాంపుల ఏర్పాటుకు కేంద్ర పథకాల నుంచి సహకారం అందించేందుకు కేంద్ర మంత్రి అంగీకరించినట్లు చెప్పారు. గోదావరి నది కాలుష్య నివారణకు అవసరమైన సాంకేతిక సలహాలు, సూచనలు అందించేందుకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిపుణుల బృందాన్ని పంపుతామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లు పవన్ కల్యాణ్‌ వెల్లడించారు. పుష్కరాల నేపథ్యంలో గోదావరి పరిశుభ్రతకు ఇది కీలక అడుగుగా అభివర్ణించారు. రాష్ట్రంలో

మ షన గ ద వర క ల న ప ర జ క ట క క ద ర మద దత క ల ష య అధ యయన న క క ద ర బ ద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in