
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో పర్యటక, సందర్శక వీసాలపై ఉంటూ.. గడువు ముగిసినా అక్కడే ఉండిపోయిన (Overstay) విదేశీయులకు అక్కడి ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. గతంలో విమాన సర్వీసుల అంతరాయం కారణంగా ప్రకటించిన ప్రత్యేక మినహాయింపు గడువు ముగిసిందని, అర్హులైన వారు జులై 9 లోగా తమ వీసా స్టేటస్‌ను సరిచేసుకోవాలని లేదా దేశం విడిచి వెళ్లాలని స్పష్టం చేసింది. లేనిపక్షంలో భారీ జరిమానాలతో పాటు చట్టపరమైన చర్యలు తప్పవని యూఏఈ ఇమ్మిగ్రేషన్ అధికారులు హెచ్చరించారు. ఈ నిర్ణయం గల్ఫ్ దేశాల్లో ఉన్న వేలాది మంది ప్రయాణికులకు, ముఖ్యంగా భారతీయులకు అత్యంత కీలకమైన సమాచారం.అసలు ఈ గ్రేస్ పీరియడ్ (మినహాయింపు) ఎందుకు ఇచ్చారంటే..?ఈ ఏడాది ప్రాంతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు, వైమానిక పరిమితుల (Airspace Restrictions) కారణంగా పలు దేశాల మధ్య విమాన సర్వీసులు ఒక్కసారిగా నిలిచిపోయాయి. దీంతో యూఏఈకి టూరిస్ట్ వీసాలపై వచ్చిన వేలాది మంది ప్రయాణికులు ప్లాన్ చేసుకున్న ప్రకారం తిరిగి తమ సొంత దేశాలకు వెళ్లలేకపోయారు.ఈ అసాధారణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న యూఏఈ ప్రభుత్వం, మానవతా దృక్పథంతో విజిట్ వీసాదారులపై ఎలాంటి ఓవర్‌స్టే జరిమానాలు పడకుండా తాత్కాలికంగా మినహాయింపు (Waiver) ఇచ్చింది. నిజానికి మార్చి నెలలోనే దేశం విడిచి వెళ్లాల్సిన చాలా మంది సందర్శకులు, ఈ నిబంధన వల్ల రూపాయి ఫైన్ కట్టకుండా మరికొన్ని నెలల పాటు యూఏఈలోనే సురక్షితంగా ఉండే అవకాశం లభించింది.US Visa రూల్స్ మార్చేసిన వైట్‌హౌస్! ఇక 4 ఏళ్లే ఛాన్స్..ఈ డెడ్‌లైన్ ఎవరికి వర్తిస్తుంది? రెసిడెన్స్ వీసాదారులకు కూడానా?ట్రావెల్, ఇమ్మిగ్రేషన్ నిపుణుల సమాచారం ప్రకారం.. ఈ జులై 9 గడువు అనేది కేవలం విజిట్ వీసా (సందర్శక వీసా) కలిగి ఉండి, విమానాల రద్దు వల్ల అక్కడ ఉండిపోయిన వారికి మాత్రమే వర్తిస్తుంది.రెసిడెన్స్ వీసాదారులకు వర్తించదు:యూఏఈలో ఉద్యోగ, వ్యాపారాల రీత్యా ఉండే రెసిడెన్స్ వీసా (Residence Visa) హోల్డర్లకు ఈ నిబంధనతో ఎలాంటి