మామ సినిమాకు అల్లుడి క్లాప్ .. 112 ప్రారంభం
Actor ProfilePolitician

మామ సినిమాకు అల్లుడి క్లాప్ .. 112 ప్రారంభం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మామ సినిమాకు అల్లుడి క్లాప్ .. 112 ప్రారంభం
Eenadu18 Jul 2026
మామ సినిమాకు అల్లుడి క్లాప్ .. 112 ప్రారంభం

ఇంటర్నెట్‌ డెస్క్: బాలకృష్ణ (Balakrishna) కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా రానున్న విషయం తెలిసిందే. ‘NBK 112’గా ప్రచారంలో ఉంది. నేడు అమరావతిలో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. రాష్ట్ర మంత్రి, బాలకృష్ణ అల్లుడు నారా లోకేశ్‌ ముఖ్య అతిథిగా హాజరై క్లాప్‌ కొట్టారు. బాలయ్య చిన్న కుమార్తె తేజస్వీని కెమెరా స్విచ్ ఆన్‌ చేశారు. క్లాప్‌ అనంతరం సినిమా డైలాగ్‌తో బాలకృష్ణ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేశ్‌, నిర్మాత సురేశ్‌ బాబుతోపాటు మరికొందరు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత సుధాకర్‌ చెరుకూరి మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని రూ.150కోట్ల నుంచి రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా ఎంటర్‌టైనర్‌గా నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది ఆగస్టులో రెగ్యులర్‌ షూటింగ్ ప్రారంభించి, 2027 వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

మ మ స న మ క అల ల డ క ల ప 112 ప ర ర భ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in