మామిడి రైతులు ఆందోళన పడొద్దు.. ఆదుకుంటాం
Actor ProfilePolitician

మామిడి రైతులు ఆందోళన పడొద్దు.. ఆదుకుంటాం

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources1
ఐపీఎస్ సునీల్ కుమార్ కు చుక్కెదురు.. పిటిషన్ ను కొట్టివేసిన క్యాట్
Andhra Jyothy22 Aug 2026
ఐపీఎస్ సునీల్ కుమార్ కు చుక్కెదురు.. పిటిషన్ ను కొట్టివేసిన క్యాట్

సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌కు మరోసారి చుక్కెదురైంది. తనపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని కోరుతూ సునీల్ కుమార్ దాఖలు చేసిన తుది పిటిషన్‌ను సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్(CAT)

మామిడి రైతులు ఆందోళన పడొద్దు.. ఆదుకుంటాం
Andhra Jyothy20 Aug 2026
మామిడి రైతులు ఆందోళన పడొద్దు.. ఆదుకుంటాం

మామిడి రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చిత్తూరు జిల్లా ఇన్‌‌ఛార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. గత ఏడాది మామిడి రైతులకు సుమారు రూ.190 కోట్లు చెల్లించి ప్రభుత్వం ఆదుకుందన్నారు. అమరావతి, జూన్ 30: మామిడి రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చిత్తూరు జిల్లా ఇన్‌‌ఛార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. గత ఏడాది కూడా కూటమి ప్రభుత్వం రైతులకు కేజీకి రూ.4 చెల్లించి అండగా నిలిచిందని గుర్తుచేశారు. ఈ ఏడాది కూడా కేజీకి రూ.4 ముందస్తు చెల్లించి మామిడి కొనుగోళ్లు కొనసాగిస్తున్నామని తెలిపారు. పంట దిగుబడి అధికంగా రావడంతో తాత్కాలికంగా కొనుగోళ్లపై ఒత్తిడి ఏర్పడిందని చెప్పారు. గత ఏడాది మామిడి రైతులకు సుమారు రూ.190 కోట్లు చెల్లించి ప్రభుత్వం ఆదుకుందన్నారు. రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. కొనుగోళ్లలో జాప్యం జరిగితే సంబంధిత ఫ్యాక్టరీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన వైసీపీ సానుభూతి కంపెనీలు కొనుగోళ్లలో అలసత్వం ప్రదర్శిస్తే ఉపేక్షించమన్నారు. రైతుల ప్రయోజనాలే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని స్పష్టం చేశారు. రైతులను వైసీపీ.. రాజకీయాలకు వాడుకోవడం మానుకోవాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హెచ్చరించారు. సాయికృష్ణ లాకప్ డెత్.. ముగ్గురిని నిందితులుగా చేర్చిన సిట్

మ మ డ ర త ల ఆ ద ళన పడ ద ద ఆద క ట Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in