
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో ర్యాలీగా వెళుతున్న వైఎస్సార్‌సీపీ నాయకులు, రైతులు మామిడి రైతులకు మద్దతుగా వైఎస్సార్‌సీపీ పోరుబాట భారీ ర్యాలీ చేసిన పార్టీ నేతలు, శ్రేణులు, రైతులు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు ఫ్యాక్టరీ ఎదుట ధర్నా ధర్నాపై పోలీసుల్ని ప్రయోగించిన బాబు సర్కారు వైఎస్సార్‌సీపీ నేత భూమన కరుణాకరరెడ్డిని లాక్కెళ్లిన పోలీసులు రైతుల పక్షాన నిలిస్తే పోలీసులతో దౌర్జన్యం చేశారని మండిపడ్డ పార్టీ శ్రేణులు, రైతులు రైతులకు న్యాయం జరిగే వరకు ఉద్యమిస్తామని భూమన ప్రకటన ఫ్యాక్టరీల దోపిడీకి చంద్రబాబు అండగా ఉన్నారని ధ్వజం కార్వేటి నగరం/కాణిపాకం: మామిడి రైతులకు మద్దతుగా వైఎస్సార్‌సీపీ మంగళవారం చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులోని పళ్ల గుజ్జు ఫ్యాక్టరీ ఎదుట పోరుబాట చేపట్టింది. రైతులతో కలిసి వైఎస్సార్‌సీపీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించి, ఫ్యాక్టరీ ఎదుట ధర్నా చేశారు. భూమన కరుణాకరరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మాజీ ఎంపీ రెడ్డెప్ప, వైఎస్సార్‌సీపీ గంగాధర నెల్లూరు, చిత్తూరు, చంద్రగిరి సమన్వయకర్తలు కృపాలక్ష్మి, విజయానందరెడ్డి, చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే సునీల్‌కుమార్ పార్టీ శ్రేణులు, రైతులతో కలిసి ర్యాలీగా ఫ్యాక్టరీ వద్దకు చేరుకున్నారు. ప్లకార్డులతో రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. గంటన్నర పాటు కదలకుండా రోడ్డుపై బైఠాయించారు. చంద్రబాబు ప్రభుత్వం పోలీసులను ప్రయోగించడంతో వారు ధర్నా చేస్తున్న నేతలు, రైతులపై పడ్డారు. భూమనను లాక్కెళ్లిపోయి, ఆ తర్వాత విడిచిపెట్టారు. చంద్రబాబు ప్రభుత్వ దౌర్జన్యాన్ని వైఎస్సార్‌సీపీ శ్రేణులు, రైతులు తీవ్రంగా ఖండించారు. రైతుల పక్షాన నిలిస్తే పోలీసులతో దౌర్జన్యం చేశారని మండిపడ్డారు. కిలోకు రూ.15 ఇచ్చేంతవరకు పోరాటం: భూమన ‘ఇంత తక్కువ ధరలతో బతకలేకపోతున్నాం.. లాభాలు వద్దు, కనీసం పెట్టుబడి వరకైనా కిలో రూ.15 ఇస్తేనే బతుకుతాం’ అంటూ మామిడి రైతులు జ్యూస్ ఫ్యాక్టరీల ఎదుట గగ్గోలు పెడుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబుకి కనీసం చీమ కుట్టినట్లయినా లేదని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర రెడ్డి తీవ్రంగా