మేము టీఎంసీని వీడలేదు
Actor ProfilePolitician

మేము టీఎంసీని వీడలేదు

Total News1
Movie Updates0
Sources1
మేము టీఎంసీని వీడలేదు
Sakshi15 Jun 2026
మేము టీఎంసీని వీడలేదు

కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) రెబల్‌ ఎంపీలు సోమవారం పార్టీ ఎన్నికల గుర్తుపై హక్కు సాధించేందుకు పోరాడతామని ప్రకటించారు. తాము టీఎంసీని వీడలేదని, దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. 20 మంది అసమ్మతి ఎంపీలు నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎన్‌సీపీఐ)లో విలీనమవుతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. సోమవారం మాత్రం మాట మార్చారు. అరూప్ చక్రవర్తి మీడియాతో మాట్లాడుతూ.. “మేము టీఎంసీని వీడలేదు. టీఎంసీలోనే ఉన్నాం. పార్టీని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. అది ఎందుకు దెబ్బతిన్నదన్న చర్చ జరగడం లేదు. పార్టీ గుర్తు కోసం మేము పోరాడతాం. మా వద్ద 20 మంది సభ్యులు ఉన్నారు. గుర్తు కోసం ఎందుకు పోరాడకూడదు?” అని తెలిపారు. రాజకీయ, న్యాయ పోరాటం దీర్ఘకాలం కొనసాగుతాయన్న సంకేతాలు ఇచ్చారు. ఈ తిరుగుబాటు పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కొత్త దశకు నాంది పలికిందని చక్రవర్తి అన్నారు. “కొత్త ఆట మొదలైంది. ఖేలా హోబే” అని ఆయన అన్నారు. ఈ పరిణామం రాష్ట్రాభివృద్ధికి ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. 20 మంది రెబల్‌ టీఎంసీ ఎంపీలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి, తాము ఎన్‌సీపీఐలో విలీనమవుతున్నట్టు ప్రకటించినప్పటికీ అరూప్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఆ సమావేశంలో ఎంపీలు పార్లమెంట్‌లో ప్రత్యేక సీటింగ్ ఏర్పాటు కోరారు. దీంతో మమతా బెనర్జీ నేతృత్వంలోని పార్టీ నుంచి శాసనసభ్యుల స్థాయిలో తమ విభజనను అధికారికంగా ప్రకటించినట్టైంది. కోర్టును ఆశ్రయిస్తాం ఆరు సార్లు ఎంపీగా ఎన్నికైన సుదీప్ బంద్యోపాధ్యాయ్ తిరుగుబాటు వర్గంలో చేరారు. తమదే నిజమైన టీఎంసీ అని నిరూపించేందుకు, పార్టీ జంట పువ్వుల ఎన్నికల గుర్తుపై హక్కు సాధించేందుకు కోర్టును ఆశ్రయిస్తామని ఆయన చెప్పారు. ఈ తిరుగుబాటుపై టీఎంసీ నాయకత్వం తీవ్రంగా స్పందించింది. పార్టీ వాదన ప్రకారం, పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం ఈ చర్య చెల్లదు. రాజ్యసభ ఎంపీ సాగరికా ఘోష్ మాట్లాడుతూ.. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారం