
పాస్‌పుస్తకాలపై వాళ్ల ఫొటోలా? భూములున్నా రైతులు అమ్ముకోలేకపోయారు పిల్లల పెళ్లిళ్లు, చదువులకు అక్కరకు రాలేదు 2019-24 మధ్య రెవెన్యూ రికార్డులు ధ్వంసం ఇష్టం లేనివాళ్ల భూములు 22ఏలో చేర్చారు భూ రికార్డుల ప్రక్షాళనకు నాడే సంకల్పించా కూటమి వచ్చాక రెవెన్యూలో సంస్కరణలు 6 రకాల భూములకు మోక్షం ఇప్పటివరకు రైతులకు 32.22 లక్షల పట్టాదార్ పాస్‌పుస్తకాలు పంపిణీ కలిదిండి సభలో సీఎం చంద్రబాబు ఏలూరు/కలిదిండి, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): ‘మీ భూమి-మీ హక్కు. దానిపై ఇతరులు పెత్తనం చేయడానికి వీల్లేదు. పాస్ పుస్తకాలపై ఇతరులు ఫొటోలు ఎలా వేసుకుంటారు? ప్రజల సమస్యలు పరిష్కరించని వారు ఏమయ్యారో అందరికీ తెలుసు’ అని వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు సీఎం చంద్రబాబు చురకలంటించారు. రాష్ట్రంలో భూమి చేతిలో ఉన్నప్పటికీ అనేక మంది రైతులు వాటిని అమ్ముకోలేకపోయారని.. పిల్లల చదువులు, పెళ్లిళ్లకు ఉపయోగపడని ఎందుకని చాలా మంది తన వద్ద ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. జగన్ పాలనలో అస్తవ్యస్తంగా మారిన భూరికార్డుల ప్రక్షాళనకు సంక ల్పం తీసుకున్నానని తెలిపారు. ఆ మేరకు రెవెన్యూలో సంస్కరణలు తీసుకొచ్చామని.. 6 రకాల భూములకు మోక్షం కల్పించే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ‘ఇప్పుడు రైతులు, ప్రజల కళ్లల్లో ఆనందం చూస్తు న్నాం. ఇదంతా మీ సహకారం.. కూటమిపై పెట్టుకున్న నమ్మకం వల్లే సాధ్యమైంది’ అని స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా కలిదిండిలో సోమవారం జరిగిన ‘మీ భూమి-మీ హక్కు’ గ్రామసభలో సీఎం పాల్గొన్నారు. నల్లజర్ల దుర్గాభవాని అనే మహిళా రైతుతో పాటు 14 మందికి రాజముద్రతో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకా లు అందించారు. అంతకుముందు తహశీల్దార్ కార్యాలయంలో మాజీ సైనికులు, రైతులతో ముచ్చటించారు. అనంతరం సభలో మాట్లాడారు. గత పాలకులు 2019-24 మధ్య చేసిన విఽధ్వంసం కారణంగా రికార్డు లు ధ్వంసమయ్యాయన్నారు. ఇష్టంలేని వ్యక్తుల భూ ములను, ఆస్తులను 22ఏలో పెట్టేసి వివాదాస్పదం చేశారన్నారు. 2024లో కూటమి వచ్చాక.. ఎక్కడకు వెళ్లినా









