
పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం కామధేనువులంక గ్రామానికి చెందిన సానబోయిన సత్యనారాయణకు చంద్రబాబు అంటే ఎంతో అభిమానం. ఒక్కసారైనా ఆయన్ను కలవాలని అనుకున్నారు. సోమవారం సిద్ధాంతంలో జరిగే ‘మీ భూమి- మీ
హక్కు’ కార్యక్రమానికి వస్తోన్న సీఎం చంద్రబాబు సభకు వెళ్లేందుకు సత్యనారాయణ సిద్ధమయ్యారు. ఈ విషయంపై ఆయన మాట్లాడుతుండగా ఓ యువకుడు వీడియో తీసి సోషల్ మీడియోలో పోస్టు చేశాడు. దీనిపై సీఎం స్పందిస్తూ.. ‘సత్యనారాయణ గారూ.. రేపు కలుద్దాం’ అని పోస్టు చేశారు. వృద్ధుడి అభిమానం.. స్పందించిన చంద్రబాబు |