ముంబైలో ఘోరం.. స్కూల్ బస్సు
Actor ProfilePolitician

ముంబైలో ఘోరం.. స్కూల్ బస్సు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ముంబైలో ఘోరం.. స్కూల్ బస్సుపై కూలిన పెద్ద చెట్టు.. ఒకరి మృతి, 10 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు..
Zee Telugu23 Aug 2026
ముంబైలో ఘోరం.. స్కూల్ బస్సుపై కూలిన పెద్ద చెట్టు.. ఒకరి మృతి, 10 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు..

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Mumbai chembur school bus tragedy: ముంబాయి మహా నగరాన్ని భారీ వర్షాలు అల్లాడిస్తున్నాయి. సామాన్య జనజీవనం అంతా అస్తవ్యస్తంగా మారిపోయింది. లోతట్టు ప్రాంతాలన్ని జలమయం అయ్యాయి. ప్రజా రవాణా పూర్తిగా దెబ్బతింది. ఈ క్రమంలో ముంబైలో భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలకు పలు సూచనలు చేశారు. ఇదిలా ఉండగా.. ముంబైలోని చెంబూరు ప్రాంతంలో స్కూల్ బస్సుపై భారీ చెట్టు విరిగిపోయి పడింది. దీంతో దానిలో ఉన్న విద్యార్థులు భయంతో కేకలు పెట్టారు. ముంబైలోని చెంబూర్ లో ఉన్న డైమండ్ గార్డెన్ సమీపంలో 11వ నంబర్ రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ ప్రాంతంలో స్కూల్ బస్సు వెళ్తుండగా ఒక్కసారిగా చెట్టు కూలిపోయి బస్సు మీద పడింది. దీంతో బస్సు ధ్వంసం అయ్యింది. దాదాపు 10 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఒక విద్యార్థి చనిపోయినట్లు అధికారులు గుర్తించారు. వెంటనే అక్కడున్న స్థానికులు పోలీసులకు, అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. బస్సులో చిక్కుకున్న వారిని బైటకు తీసుకొని వచ్చారు. దగ్గరలోని ఆస్పత్రులకు తరలించారు. వాహనంలో మొత్తం 13 మంది పిల్లలు ఉన్నారు. ఆ ప్రాంతంలో గతంలో కూడా ఇలాంటి ఘటనే జరిగిందని చెబుతున్నారు. చెట్లను కత్తిరించాలని లేదా తొలగించాలని కోరుతూ తాము బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC)కి పదేపదే లేఖలు రాశామని స్థానిక నివాసితులు ఆరోపించారు. పలుమార్లు హెచ్చరించినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. Read more: Heavy rain in Mumbai: భారీ వర్షానికి చిగురుటాకుల వణికిపోయిన ముంబాయి.. నాలుగు గంటల్లో 100 మి.మీల కంటే

మ బ ల ఘ ర స క ల బస స Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in