ముంబైలో కనువిందు చేసిన జంట ఇంద్రధనస్సులు.. వీడియో వైరల్
Actor ProfilePolitician

ముంబైలో కనువిందు చేసిన జంట ఇంద్రధనస్సులు.. వీడియో వైరల్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ముంబైలో కనువిందు చేసిన జంట ఇంద్రధనస్సులు.. వీడియో వైరల్
Andhra Jyothy21 Jul 2026
ముంబైలో కనువిందు చేసిన జంట ఇంద్రధనస్సులు.. వీడియో వైరల్

ముంబైలో గురువారం చిరుజల్లుల తర్వాత మెరైన్ డ్రైవ్‌పై అరుదైన జంట ఇంద్రధనస్సు కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.. ఇంటర్నెట్ డెస్క్: ముంబైలోని మెరైన్ డ్రైవ్ (క్వీన్స్ నెక్లెస్) పై ఆకాశంలో గురువారం అద్భుతమైన రెండు ఇంద్రధనస్సులు (డబుల్ రెయిన్ బో) కనిపించాయి. అరేబియా సముద్రం మీదుగా వర్షం పడి ఆగిన తర్వాత ఈ మనోహరమైన దృశ్యం ఆవిష్కృతమైంది. ముంబై వాసులు, పర్యాటకులు ఆనందంలో మునిగిపోయారు. ఈ అద్భుత దృశ్యాన్ని చూసి తమ మొబైల్ ఫోన్లలో బంధించారు. కొద్ది సేపటికే ఈ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం ఈ అందమైన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ముంబైలోని మెరైన్ డ్రైవ్‌పై ఓ ప్రకాశవంతమైన ఇంద్రధనస్సు స్పష్టంగా కనిపిస్తుండగా.. దానిపై మరో ఇంద్రధనస్సు ఏర్పడింది. ఈ రెండు ఇంద్రధనస్సులు దృశ్యాన్ని అందరినీ అలరించాయి. మేఘాలతో నిండిన ఆకాశం, సముద్ర తీర సౌందర్యం, రంగురంగుల ఇంద్రధనస్సులు కలిసి నగరానికి మరింత అందాన్ని చేకూర్చాయి. ఈ వారం ప్రారంభంలో ముంబైలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. గురువారం ఉదయం కురిసిన జల్లుల అనంతరం ఏర్పడిన వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ అరుదైన జంట ఇంద్రధనస్సు దర్శనమిచ్చినట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఆదరణ పథకానికి రూ.1000 కోట్లు.. మంత్రి సవిత కీలక ప్రకటన