మీ పాపులారిటీ
Actor ProfilePolitician

మీ పాపులారిటీ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మీ పాపులారిటీపై దృష్టి పెట్టండి - ట్రంప్ నకు మెలోనీ కౌంటర్
Eenadu21 Jun 2026
మీ పాపులారిటీపై దృష్టి పెట్టండి - ట్రంప్ నకు మెలోనీ కౌంటర్

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ (Donald Trump), ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ (Giorgia Meloni) మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. జీ-7 సదస్సుల్లో ఫొటో కోసం మెలోనీ పదే పదే అడిగారని ట్రంప్‌ మరోసారి చెప్పడంపై ఇటలీ ప్రధాని తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఆయనకు కౌంటర్‌ ఇచ్చారు. ‘‘నా ప్రజాదరణ విషయానికొస్తే.. మీ (ట్రంప్‌) స్నేహితురాలిగా ఉండటం నా పాపులారిటీకి ఏమాత్రం సాయపడలేదు. మీతో ఉన్న స్నేహంపై అది ఆధారపడి లేదు. ఇటలీ జాతీయ ప్రయోజనాలను కాపాడగల సామర్థ్యాలపైనే నా ప్రజాదరణ ఆధారపడి ఉంటుంది. నేను ఎల్లప్పుడూ అదే చేస్తున్నా’’ అని మెలోనీ పేర్కొన్నారు. ఏదేమైనా తన పాపులారిటీ గురించి ట్రంప్‌నకు ఆందోళన వద్దని అమెరికాలో ప్రజాదరణపైనే దృష్టి పెట్టుకోవాలని సూచిస్తున్నట్లు చెప్పారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

మ ప ప ల ర ట Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in