
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. EPF New Rule: ఈపీఎఫ్‌లో కొత్త మార్పులు ఉద్యోగుల జీతాలు, భవిష్యత్ పొదుపుపై ప్రభావం ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. నెలకు రూ. 15,000 కంటే ఎక్కువ మూల వేతనం ఉన్న ఉద్యోగులకు ఈ కొత్త నిబంధనలు ఎలా వర్తిస్తాయో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇంతకుముందు రూ. 15,000 వరకు బేసిక్ సాలరీ ఉన్న ఉద్యోగులు ఈపీఎఫ్ పథకంలో చేరడం తప్పనిసరి అని ఉండేది. ఈ పరిమితి కంటే ఎక్కువ మూల వేతనం సంపాదించే ఉద్యోగులకు, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నడుపుతున్న ఈ సామాజిక భద్రతా పథకంలో స్వచ్ఛందంగా చేరే అవకాశం ఉండేది. ఈపీఎఫ్ పథకంలో చేరిన తర్వాత, ఉద్యోగులు తమ వాస్తవ మూల వేతనం ఆధారంగా ఈపీఎఫ్ చెల్లింపులు చేస్తారు. యజమానులు కూడా అదే రేటు ప్రకారం చెల్లింపులు చేస్తారు. జీతం ప్రభుత్వం నిర్దేశించిన వేతన పరిమితిని మించినప్పటికీ.. వాస్తవ మూల వేతనం ఆధారంగా చెల్లింపులు చేయవచ్చు. అయితే ఇప్పుడు కార్మిక,ఉపాధి మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రకటించిన ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ 2026 ప్రకారం.. నెలకు రూ. 15,000 వేతన పరిమితికి మించిన ఈపీఎఫ్ చెల్లింపులు స్వచ్ఛందమైనవిగా మారాయని చెప్పాలి. గత ఉద్యోగుల భవిష్య నిధి పథకం 1952 ప్రకారం, నెలకు రూ. 15,000 వరకు సంపాదించే ఉద్యోగులు ఈపీఎఫ్ లో చేరవలసి ఉండేది. రూ. 15,000 కంటే ఎక్కువ సంపాదించే ఉద్యోగులు కూడా ఇందులో చేరడానికి ఎంచుకోవచ్చు. ఒకసారి చేరిన తర్వాత, ఉద్యోగి వాస్తవ మూల వేతనం ఆధారంగా ఉద్యోగి, యజమాని ఇద్దరూ తమ వాటాను చెల్లిస్తారు. వేతనం ప్రభుత్వం నిర్దేశించిన వేతన పరిమితిని మించినప్పటికీ ఈ విధానం