మున్నా భయ్యా ఆగయా’.. మీర్జాపూర్ ది మూవీ’ టీజర్ కు ఫ్యాన్స్ ఫిదా
Actor ProfileCelebrity

మున్నా భయ్యా ఆగయా’.. మీర్జాపూర్ ది మూవీ’ టీజర్ కు ఫ్యాన్స్ ఫిదా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మున్నా భయ్యా ఆగయా’.. మీర్జాపూర్ ది మూవీ’ టీజర్ కు ఫ్యాన్స్ ఫిదా
Chitrajyothy21 Jul 2026
మున్నా భయ్యా ఆగయా’.. మీర్జాపూర్ ది మూవీ’ టీజర్ కు ఫ్యాన్స్ ఫిదా

వెబ్‌సిరీస్‌ల్లో సంచలనంగా నిలిచిన సిరీస్‌ ‘మీర్జాపూర్‌’. యాక్షన్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌గా గుర్మీత్‌ సింగ్‌ తెరకెక్కించారు. అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అయిన ఈ సిరీస్‌ ఓటీటీ వీక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. వెబ్‌సిరీస్‌ల్లో సంచలనంగా నిలిచిన సిరీస్‌ ‘మీర్జాపూర్‌’ (MIRZAPUR THE MOVIE). యాక్షన్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌గా గుర్మీత్‌ సింగ్‌ (Gurmith singh) తెరకెక్కించారు. అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అయిన ఈ సిరీస్‌ ఓటీటీ వీక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లో ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. తొలి సీజన్‌ 2018 నవంబరులో ప్రేక్షకుల ముందుకొచ్చింది. రెండో సిరీస్‌ 2020 అక్టోబర్‌లో, 2024 జూలైలో మూడో సిరీస్‌ విడుదలయ్యాయి. ఇప్పుడీ సిరీస్‌ ఆధారంగా సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. ‘మీర్జాపూర్‌ ది మూవీ’ పేరుతో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్‌ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా దీని టీజర్‌ను గురువారం మేకర్స్‌ విడుదల చేశారు. గతంలోనే ఈ సినిమాకు సంబంధించి మేకర్స్‌ ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. ‘మీర్జాపూర్‌’ సిరీస్‌కు ప్రీక్వెల్‌గా ఈ సినిమా ఉంటుందని తెలిపారు. ఈ సిరీస్‌ మూడు పార్టుల్లో మరణించినవారంతా తెరపై కనిపిస్తారని తెలిపారు. పంకజ్‌ త్రిపాఠి, శ్వేతా త్రిపాఠి, దివ్యేందు శర్మ, అలీ ఫజల్‌, శ్రియ పిల్గోంగర్‌, హర్షిత గౌర్‌ తదితరులు కీలక పాత్రధారులు. ఇందులో దివ్యేందు పోషించిన మున్నా పాత్రకు ఎంత క్రేజ్‌ ఉందో తెలిసిందే. తాజాగా విడుదలైన టీజర్‌పై మున్నా పాత్ర కనిపించడంతో ఈ సిరీస్‌ లవర్స్‌ ఆకస్తికరమైన కామెంట్స్‌ చేస్తున్నారు. మున్నా పాత్రకు ఫిదా అవుతున్నారు. ‘మున్నాను తీసుకురావడం కోసం మేకర్స్‌ సినిమానే తీశారు’ అని ఓ నెటిజన్‌, ‘మున్నా భయ్యా ఆగయా’ అంటూ మరికొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. లీగల్ వివాదంలో ప్రభాస్ ‘స్పిరిట్’.. టైటిల్ మార్చాల్సిందేనా? పీఆర్ స్టంట్స్.. పిక్చర్స్‌కు పనికొచ్చేనా..! ‘పెద్ది’ సక్సెస్ చూసి నాకు ‘ఠాగూర్’‌లోని డైలాగ్ గుర్తొచ్చింది: రామ్ చరణ్ Dharman: తలైవర్ 173 టైటిల్ ఖరారు

మ న న భయ య ఆగయ మ ర జ ప ర ద మ వ ట జర క ఫ య న స ఫ ద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in