
రీసెంట్ గా పెద్ది సక్సెస్ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ అయ్యారు. తన వారసుడిగా రామ్ చరణ్ సాధించిన ఘనతను తలుచుకుని ఉప్పొంగిపోయాడు. అదే సమయంలో సినిమా కోసం రామ్ చరణ్ పడుతున్న కష్టాన్ని అభినందిస్తూనే.. చరణ్ కు జరిగిన ప్రమాదాలను తలుచుకుని బాధపడ్డారు. తండ్రిగా తాన ఫీలింగ్ ఏంటో వెల్లడించారు. ఈక్రమంలో తాన కెరీర్ బిగినింగ్ లో తన తండ్రి ఎలా ఫీలయ్యారో.. ఏమని కామెంట్ చేశారో గుర్తు చేశారు చిరంజీవి. పెద్ది ఈవెంట్ తో తన తండ్రిని తలుచుకుని మెగాస్టార్ చేసిన ఎమోషనల్ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. చిరంజీవి మాట్లాడుతూ.. '' తోటి నటుడిగా, పరిశ్రమలో సీనియర్ యాక్టర్ గా చెప్పాలంటే... రామ్ చరణ్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఒక తండ్రిగా గర్వపడుతున్నాను. యాక్షన్, డ్యాన్స్, ఎమోషన్స్, ఇంటెన్సిటీ, ఇన్వాల్వ్‌మెంట్... ఒక నటుడికి అవసరమైన అన్ని కోణాల్లో పరిపక్వత సాధించి, దానిని 100 శాతం చరణ్ తెరపై చూపించాడు. రంగస్థలంలో చరణ్ ఎంత అద్భుతంగా నటించాడో అందరికి తెలుసు.. మళ్లీ అలాంటి పాత్ర ఎప్పుడొస్తుందా అని అనుకున్నా.. కానీ మూడేళ్లలోనే.. పెద్దిలాంటి మరో గొప్ప పాత్ర రావడం ఆశ్చర్యంగా అనిపించింది. ఈ పాత్ర దక్కడం నిజంగా చరణ్ అదృష్టం.సినిమా చూస్తున్నప్పుడు మాకు చరణ్ కనిపించలేదు... పెద్ది మాత్రమే కనిపించాడు. ఆ పాత్రను పూర్తిగా ఒంటబట్టించుకున్నాడు. పెద్ది పాత్రతో మనందరినీ నవ్వించాడు, ఏడిపించాడు, ఉత్సాహపరిచాడు, భావోద్వేగానికి గురిచేశాడు. కళ్లతోనే భావాలను పలికిస్తూ ప్రేక్షకుల కళ్లలో నీళ్లు తెప్పించగలిగాడు. అదే పరిపూర్ణ నటన. ఈరోజు రామ్ చరణ్ ఆ పరిపక్వతను, ఆ సంపూర్ణతను చూపించి నన్ను పూర్తిగా సంతృప్తిపరిచాడు. చివరిగా విజయం సాధించాడు. ఆ పాత్రలో అతను చూపించిన నటనకు నా హృదయపూర్వక అభినందనలు.. అని చిరంజీవి అన్నారు. చిరంజీవి మాట్లాడుతూ.. '' షూటింగ్ సమయంలో చరణ్ కంటికి గాయం అయింది. ఆ ఫొటో చూసి నేను చాలా భయపడ్డాను. డాక్టర్లతో మాట్లాడిన తర్వాత