మంది మృతి.. మోదీ దిగ్భ్రాంతి
Actor ProfilePolitician

మంది మృతి.. మోదీ దిగ్భ్రాంతి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మంది మృతి.. మోదీ దిగ్భ్రాంతి
Eenadu19 Jul 2026
మంది మృతి.. మోదీ దిగ్భ్రాంతి

Venezuela Earthquakes| ఇంటర్నెట్‌డెస్క్‌: వెనెజువెలాలో సంభవించిన వరుస భూకంపాలతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 32 మంది ప్రాణాలు కోల్పోగా.. 700 మంది వరకు గాయపడ్డారని తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌ వెల్లడించారు. రాజధాని నగరం కరాకస్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో భూకంప తీవ్రత ధాటికి భవనాలు కూలిపోవడంతో.. శిథిలాల కింద అనేక మంది చిక్కుకున్నారు. దాంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. వెనెజువెలా ప్రకృతి విలయంపై ప్రధాని మోదీ (PM Modi) తీవ్ర విచారం వ్యక్తంచేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. ఈ క్లిష్ట సమయంలో ఆ దేశానికి అండగా ఉంటామని ఎక్స్ వేదికగా వెల్లడించారు. వెనెజువెలా ప్రజలకు సహాయం చేయడానికి అమెరికా సిద్ధంగా ఉందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ట్రూత్‌లో పోస్టు పెట్టారు. ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేలా సంసిద్ధంగా ఉండాలని అన్ని ఏజెన్సీలను ఆదేశించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా వెనెజువెలా ప్రజలను గొప్ప స్నేహితులుగా అభివర్ణించారు. ఇప్పటికే సహాయక బృందాలను మోహరించామని అమెరికా విదేశాంగమంత్రి మార్కో రూబియో వెల్లడించారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. వెనెజువెలా దేశంలో వరుసగా రెండు భూకంపాలు సంభవించాయి. ఈ ప్రకృతి విపత్తు తీవ్రతకు ఆ దేశ రాజధానిలో తీవ్ర నష్టం వాటిల్లింది. పలు బహుళ అంతస్తు భవనాలు కుప్పకూలాయి. మరోవైపు శిథిలాల కింద చిక్కుకున్న వారికోసం అగ్నిమాపక, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఆ ఫొటోలు

మ ద మ త మ ద ద గ భ ర త Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in