మోదీ పర్యటనకు ధురంధర్ ’ టచ్ .. మేక్రాన్ ఆసక్తికర పోస్ట్
Actor ProfileCelebrity

మోదీ పర్యటనకు ధురంధర్ ’ టచ్ .. మేక్రాన్ ఆసక్తికర పోస్ట్

Total News1
Movie Updates0
Sources1
మోదీ పర్యటనకు ధురంధర్ ’ టచ్ .. మేక్రాన్ ఆసక్తికర పోస్ట్
AP7AM15 Jun 2026
మోదీ పర్యటనకు ధురంధర్ ’ టచ్ .. మేక్రాన్ ఆసక్తికర పోస్ట్

భారత్‌-ఫ్రాన్స్‌ సంబంధాలకు బాలీవుడ్‌ టచ్‌ ఇచ్చారు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌. ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్‌ పర్యటన సందర్భంగా ఆయన షేర్‌ చేసిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. బాలీవుడ్‌ చిత్రం ‘ధురంధర్‌’లోని ప్రముఖ ‘ఆరీ ఆరీ’ పాటను బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే చేస్తూ మోదీ పర్యటనలోని ముఖ్య ఘట్టాలను ఆ వీడియోలో పొందుపరిచారు.సుమారు 30 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోను ‘ఎక్స్‌’, ఇన్‌స్టాగ్రామ్‌లో మేక్రాన్‌ పోస్టు చేశారు. మోదీ, మేక్రాన్‌ పరస్పరం కరచాలనం చేసుకోవడం, ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవడం నుంచి వీడియో ప్రారంభమవుతుంది. అనంతరం ఫ్రాన్స్‌లోని నీస్‌ నగరంలో మోదీ పాల్గొన్న కార్యక్రమాలు, ఇరు దేశాల మధ్య సాంకేతికత, ఆవిష్కరణలు, వ్యూహాత్మక భాగస్వామ్యానికి సంబంధించిన దృశ్యాలు కనిపిస్తాయి.భారతీయ పాప్‌ కల్చర్‌ను మేక్రాన్‌ తన సోషల్‌ మీడియా పోస్టుల్లో ఉపయోగించడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా భారత్‌ పర్యటన ముగిసిన తర్వాత 'ధురంధర్‌'కు సంబంధించిన సంగీతంతో కూడిన వీడియోను ఆయన షేర్‌ చేశారు. దీంతో భారతీయ నెటిజన్ల నుంచి మంచి స్పందన లభించింది