ముద్దుల మావయ్యకి ధన్యవాదాలు
Actor ProfilePolitician

ముద్దుల మావయ్యకి ధన్యవాదాలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ముద్దుల మావయ్యకి ధన్యవాదాలు
NTV Telugu19 Jul 2026
ముద్దుల మావయ్యకి ధన్యవాదాలు

నటసింహం నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో NBK112వ చిత్రం పూజా కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. నవ్యాంధ్ర రాజధాని అమరావతి వేదికగా ఈ సినిమా గ్రాండ్ లాంచ్ వేడుక అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీ మంత్రులు నారా లోకేష్, కందుల దుర్గేష్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ‘సినిమా ఓపెనింగ్ కు నేను ఎప్పుడూ రాలేదు. ముద్దుల మావయ్యకి ధన్యవాదాలు. పెద్ద బ్యానర్ పెద్ద నటుడి తో సినిమా అమరావతి లో జరగడం ఆనందంగా ఉంది. భవిష్యత్తు లో సినిమాలు ఇక్కడ ప్రారంభం కావాలి. అమరావతి లో సినీ పరిశ్రమ అభివృద్ధి కి చర్యలు తీసుకుంటున్నాము. సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ : బాలకృష్ణ 112 వ. సినిమా రాజధాని అమరావతి లో ప్రారంభం కావడం ఆనందంగా ఉంది. ఆంధ్రుల అభిమాన రాజధాని అమరావతి. మెజార్టీ సినిమా అమరావతి ప్రాంతంలో నే షూటింగ్ ఉంటుంది. ఏపీ లో. తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్. ఎంతో ప్రయత్నం చేస్తున్నారు.ఫిల్మ్ డవలప్మెంట్ కార్పోరేషన్ కొత్త కార్యవర్గం కూడా వచ్చింది. ఏపీ లో తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధి కి కృషి చేస్తున్నాం. నందమూరి బాలకృష్ణ : మా సినిమా ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రులు లోకేష్, దుర్గేష్ కు నా ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది. ఎన్టీఆర్, ఏఎన్నార్ పుట్టిన నేల ఇది. ఈ నేలలో మనం సినిమా రంగాన్ని అభివృద్ధి చేద్దాం. అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. ఎవరినీ బలవంతం చేయడం కాదు.. ఇక్కడ అన్ని సదుపాయాలను ఏర్పాటు చేస్తాం. ఏపీ లో పెద్ద సినిమా క్లాప్ కొట్టి 20 ఏళ్ళు అయింది. ఏపీ లో సినీ పరిశ్రమ అభివృద్ధికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం. పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారు

మ ద ద ల మ వయ యక ధన యవ ద ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in