మోదీ క్యాబినెట్ లో భారీ ప్రక్షాళన ? వైఫల్యాల
Actor ProfilePolitician

మోదీ క్యాబినెట్ లో భారీ ప్రక్షాళన ? వైఫల్యాల

Total News1
Movie Updates0
Sources1
మోదీ క్యాబినెట్ లో భారీ ప్రక్షాళన ? వైఫల్యాలపై తీవ్ర వ్యతిరేకత..! ఇప్పుడు కాకపోతే
Oneindia Telugu14 Jun 2026
మోదీ క్యాబినెట్ లో భారీ ప్రక్షాళన ? వైఫల్యాలపై తీవ్ర వ్యతిరేకత..! ఇప్పుడు కాకపోతే

త్వరలో కేంద్ర కేబినెట్ ప్రక్షాళనకు (Union Cabinet reshuffle) ప్రధాని మోడీ (PM modi) సిద్దమవుతున్నారు. ఇందులో రాజకీయ ప్రయోజనాలను పక్కనబెట్టి, కీలక మార్పులు చేర్పులు చేయాలంటూ తాజాగా ఓ బీజేపీ అనుకూలంగా రచయిత చేసిన సూచనలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ప్రస్తుత కేంద్ర క్యాబినెట్ పూర్తిగా అలసిపోయిందని, పనితీరు సరిగ్గా లేని పనికిరాని శక్తులను తక్షణమే పక్కనబెట్టాలని ఆయన తేల్చిచెప్పేశారు. వారి స్థానంలో కొత్త ముఖాలు, కొత్త ఆలోచనలు ఉన్నవారికి అర్హత ప్రాతిపదికన అవకాశం కల్పించాలని గట్టిగా సూచించారు. అయితే, మోదీ-షా ద్వయం ప్రస్తుత మంత్రులను కదపడానికి లేదా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జోలికి వెళ్లడానికి సాహసించలేకపోయారు. ప్రభుత్వ నిర్ణయాల మైలేజ్ అంతా ప్రధాని మోదీకే వెళ్లే క్రమంలో, క్షేత్రస్థాయి వైఫల్యాలకు కేవలం మంత్రులను మాత్రమే ఎలా బాధ్యులను చేస్తారనే ప్రాథమిక ప్రశ్నే ఇందుకు కారణం. Raghav Chadha: కేబినెట్ విస్తరణ వేళ రాఘవ్ చద్దాపై మోడీ కీలక నిర్ణయం..!అధికార కేంద్రంగా పీఎంవో-మంత్రులు నామమాత్రందేశంలో జాతీయ పరీక్షల విధానాన్ని పదే పదే వివాదాల్లోకి నెట్టి లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసిన విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను గానీ, ఆర్థిక మందగమనానికి, పన్నుల భారానికి కారణమంటూ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను గానీ ప్రధాని మోదీ మంత్రివర్గం నుంచి తొలగించలేకపోతున్నారు. ఎందుకంటే ప్రతి ప్రభుత్వ పథకాన్ని మోదీ తన సొంత పేరుతోనే ప్రచారం చేసుకుంటారు. గతంలో బడ్జెట్ కేటాయింపులకు సంస్కృత పేర్లు పెట్టి, వాటిని మోదీ ప్రత్యేక ఫ్లాగ్‌షిప్ ఐడియాలుగా ప్రచారం చేసిన వ్యూహం ఇప్పుడు పనిచేయడం లేదు. ఈ అతి కేంద్రీకరణే ప్రస్తుతం ప్రభుత్వానికి ఒక పెద్ద సమస్యగా మారింది. నిర్ణయాధికారం అంతా పీఎంఓ చేతుల్లోనే ఉండటంతో మంత్రులు కేవలం నామమాత్రపు అధికారులుగా మిగిలిపోతున్నారు. మోడీ కేబినెట్ నుంచి ఇద్దరు అవుట్ ? విస్తరణకు ముందే షాక్..!