మంది ఆర్టిస్ట్ లతో రాజమౌళి భారీ ప్లాన్
Actor ProfileActor

మంది ఆర్టిస్ట్ లతో రాజమౌళి భారీ ప్లాన్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మంది ఆర్టిస్ట్ లతో రాజమౌళి భారీ ప్లాన్, మహేష్ బాబు కోసం జక్కన్న చేయబోతున్న అతిపెద్ద రికార్డు
Asianet News Telugu19 Aug 2026
మంది ఆర్టిస్ట్ లతో రాజమౌళి భారీ ప్లాన్, మహేష్ బాబు కోసం జక్కన్న చేయబోతున్న అతిపెద్ద రికార్డు

ఇండియన్ సినిమాలో భారీ కథలను తెరకెక్కించడంలో 'బాహుబలి' ఒక కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసింది. ఆ సినిమాతో రాజమౌళి, తెలుగు సినిమాను ఒక్కసారిగా పాన్-ఇండియా లెవెల్‌కు తీసుకెళ్లారు. 'బాహుబలి 2' తర్వాత వచ్చిన 'RRR'తో అయితే విదేశాల్లోనూ అభిమానులను సంపాదించుకున్నారు. అంతే కాదు టాలీవుడ్ కు మొదటి సారి ఆస్కార్ ను తీసుకొచ్చింది ఆర్ఆర్ఆర్ సినిమా. ఇక ప్రస్తుతం అంతకు మించిన రికార్డు కోసం రాజమౌళి రెడీ అవుతున్నాడు. ఆయన తన కెరీర్‌లోనే అతిపెద్ద సినిమాను తెరకెక్కించే పనిలో ఉన్నారు. మహేష్ బాబు హీరోగా.. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా వారణాసి మూవీ తెరకెక్కుతోంది. పాన్ వరల్డ్ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ గురించి బయటకు వస్తున్న ప్రతి అప్‌డేట్ సినిమా లవర్స్‌లో క్యూరియాసిటీని పెంచుతోంది.ఈ సినిమాతో మహేష్ బాబు రేంజ్ ఓ రేంజ్ లో మారబోతోది. వారణాసి నుంచి ఎపుడెప్పుడు అప్ డేట్ వస్తుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. తాజాగా ఓ న్యూస్ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ సినిమా కోసం రాజమౌళి వేసిన ప్లాన్ గురించి తెలిసి అంతా నోరెళ్లబెడుతున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే? రాజమౌళి అంటేనే భారీ సెట్లు, యుద్ద సన్నివేశాలకు పెట్టింది పేరు. 'బాహుబలి'లోని వార్ సీన్స్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచాయి. కానీ, 'వారణాసి'లో అంతకుమించి, కొన్ని రెట్లు పెద్దగా, అద్భుతంగా ఉండేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.రిపోర్టుల ప్రకారం, ఈ సినిమాలోని ఒక యుద్ధ సన్నివేశం కోసం రాజమౌళి ఏకంగా 3500 మంది జూనియర్ ఆర్టిస్టులను వాడుతున్నారట. దీనికోసం గత కొన్ని వారాలుగా టీమ్ ప్రిపరేషన్స్ కూడా చేస్తోందట. అయితే, సిల్వర్ స్క్రీన్‌పై ప్రేక్షకులు చూసేది ఇంతకంటే చాలా పెద్ద సీన్. విజువల్ ఎఫెక్ట్స్ (VFX) సహాయంతో ఈ 3500 మందిని ఏకంగా 50,000 మంది సైనికులుగా చూపించబోతున్నారని సమాచారం. ఇది ఇండియన్ సినిమా చరిత్రలోనే

మ ద ఆర ట స ట లత ర జమ ళ భ ర ప ల న Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in