
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Taylor Swift And Travis Kelce Officially Married: పాప్ స్టార్ టేలర్ స్విఫ్ట్ , ఫుట్‌బాల్ స్టార్ ట్రావిస్ కెల్సీల అభిమానుల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. ఈ జంట న్యూయార్క్‌లోని చారిత్రాత్మక మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో అధికారికంగా వివాహం చేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు వారి అంగరంగ వైభవమైన వేడుకకు హాజరయ్యారు. సోషల్ మీడియా నుండి మీడియా వరకు.. ఈ మెగా-వెడ్డింగ్ గురించే అందరూ చర్చించుకుంటున్నారు. వీరి మూడేళ్ల ప్రేమాయణం జూలై 4న న్యూయార్క్‌లో జరిగిన ఒక ప్రైవేట్ వివాహ వేడుకతో ముగిసింది. ఈ వార్తను టేలర్ స్విఫ్ట్ పబ్లిసిస్ట్ అధికారికంగా ధృవీకరించారు. మాన్‌హాటన్‌లోని ప్రసిద్ధ క్రీడా వేదిక అయిన మాడిసన్ స్క్వేర్ గార్డెన్ వెలుపల ఒక పెద్ద తెరపై జస్ట్ మ్యారీడ్ అని ప్రదర్శించగా.. గ్రామీ అవార్డు గెలుచుకున్న కాన్సాస్ సిటీ చీఫ్స్ స్టార్ అయిన టేలర్ స్విఫ్ట్, రాయిటర్స్‌కు పంపిన ఒక ఈమెయిల్‌లో వెంటనే ఈ వివాహాన్ని ధృవీకరించారు. ఎంతో వైభవంగా జరిగిన వివాహా వేడుకకు హాలీవుడ్, సంగీత ప్రపంచానికి చెందిన అనేక మంది ప్రముఖులతో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరయ్యారు. హాలీవుడ్ హాస్యనటుడు ఆడమ్ శాండ్లర్ ఈ వేడుకను నిర్వహించారని ఆ ప్రకటనలో తెలిపారు. ఈ ఘనమైన వివాహానికి ముందు, స్విఫ్ట్ స్వస్థలమైన నాష్‌విల్‌లో కేవలం అత్యంత సన్నిహితుల సమక్షంలో వారు రహస్యంగా వివాహం చేసుకున్నారని వార్తలు వచ్చాయి. తమ వివాహం ఎప్పటికీ గుర్తుండిపోయేలా.. ఈ జంట అమెరికాలోని 20 స్థానిక, జాతీయ స్వచ్ఛంద సంస్థలకు భారీ మొత్తంలో విరాళాలు అందించి తమ ఉదారతను ప్రదర్శించారు. టేలర్ స్విఫ్ట్ అత్యంత సన్నిహితులు, సంగీత పరిశ్రమ ప్రముఖులైన