
తిరుపతి: వీబీ జీరామ్‌జీ.. గ్రామాల ముఖచిత్రం మార్చే కార్యక్రమమని సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. దీనిపై ప్రధాని మోదీని అభినందించాలన్నారు. గతంలో ఉపాధి హామీని రాయలసీమ నుంచే ప్రారంభించారని గుర్తుచేశారు. ఇప్పుడు మెరుగైన సవరణలతో వీబీ జీరామ్‌జీని తీసుకొచ్చారని పేర్కొన్నారు. తిరుపతి జిల్లా ముక్కాలవారి పల్లెలో ఈ పథకానికి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో కలిసి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం నుంచి రూ.7,700 కోట్లు, రాష్ట్ర వాటా రూ.4 వేల కోట్లు కలిసి మొత్తం రూ.11వేల కోట్ల పైనే ఈ పథకానికి ఖర్చు పెడుతున్నామన్నారు. ‘‘ఈ పథకం కింద ఏ అభివృద్ధి పని అయినా చేసుకోవచ్చు. భూసార పరిరక్షణ, రహదారులు, డ్రైనేజీలు నిర్మించుకోవచ్చు. కొత్త ఆలోచనలు, విధానాలతో సమాజానికి మేలు చేసేలా కేంద్రం సంకల్పించింది. పనిని 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచడం సంతోషించే విషయం. దొంగ లెక్కలు రాసుకోలేని విధంగా డిజిటల్ విధానం తీసుకొచ్చారు. పారదర్శకత కోసం రియల్‌టైమ్ మానిటరింగ్ ఉంటుంది’’ అని చంద్రబాబు తెలిపారు. ‘‘గాలేరు-నగరి కాల్వ కోడూరుకు తీసుకొచ్చే బాధ్యత మాది. జలధార ద్వారా భూగర్భ జలాలను పెంచుకునేలా సంకల్పించాం. ఎంజీనరేగాలో కేంద్ర, రాష్ట్రాల వాటా 90-10గా ఉండేది. ఇప్పుడు రాష్ట్రం వాటా 40శాతం ఉంది. గడిచిన ప్రభుత్వ హయాంలో నిధులన్నీ దారిమళ్లించారు. ఇప్పుడు ఉపముఖ్యమంత్రి పవన్ నాయకత్వంలో గ్రామాల రూపురేఖలు మారుతాయి. ఒకే సారి గ్రామసభలు ఏర్పాటు చేసి గిన్నిస్ రికార్డు నెలకొల్పిన ఘనత పవన్‌ది. 2024 ఆగస్టు 23న రాష్ట్ర వ్యాప్తంగా 13,226 గ్రామాల్లో ఒకేసారి గ్రామసభలు నిర్వహించారు. వేల కి.మీ మేర సీసీ రోడ్లు, 40వేల గోకులాలు, 15,500 నీటి తొట్టెలు నిర్మించారు. కొండ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వేసిన ఘనత పవన్ కల్యాణ్‌ది’’ అని సీఎం ప్రశంసించారు. ‘‘రాష్ట్రంలో గొడ్డలి పార్టీ ఉంది. దాంతో జాగ్రత్తగా ఉండాలి. అది