మెట్రో ప్రాజెక్ట్ ను ఎవరూ అడ్డుకోవడం లేదు
Actor ProfilePolitician

మెట్రో ప్రాజెక్ట్ ను ఎవరూ అడ్డుకోవడం లేదు

Total News1
Movie Updates0
Sources1
మెట్రో ప్రాజెక్ట్ ను ఎవరూ అడ్డుకోవడం లేదు
Telugu Times16 Jun 2026
మెట్రో ప్రాజెక్ట్ ను ఎవరూ అడ్డుకోవడం లేదు

తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ మెట్రో ప్రాజెక్టు (Metro Project)ను అడ్డుకోవాల్సిన అవసరం కిషన్ రెడ్డి (Kishan Reddy)కి లేదన్నారు. అర్థంలేని ఆరోపణలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ సర్టిఫికెట్ తమకు అవసరం లేదని వ్యాఖ్యానించారు. సర్ విషయంలో కాంగ్రెస్ గందరగోళం చేస్తోందని మండిపడ్డారు. బంగ్లాదేశ్ (Bangladesh) వాళ్లకు ఓటు ఇవ్వాలా అని ప్రశ్నించారు. ఇతర దేశాల వారి ఓట్లను తొలగించాలని కాంగ్రెస్ ఎందుకు డిమాండ్ చేయడం లేదని నిలదీశారు. మావోయిస్టులు (Maoists) చివరికి సాధించింది ఏంటి అని ప్రశ్నించారు. తుపాకీ గొట్టంతో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని అభం శుభం తెలియని మైనర్లు ప్రాణాలు కోల్పోయారన్నారు. చివరికి మావోయిస్టు సంస్థని నిషేధానికి గురయ్యేలా చేశారని వ్యాఖ్యానించారు. తుపాకీ గొట్టం ద్వారా ఏమీ సాధించలేమని మావోయిస్టు అగ్ర నేతలు కూడా గుర్తించారని, కేంద్రానికి సహకరించి చాలామంది లొంగిపోయారన్నారు. మావోయిస్టులు ఇక లేరని అన్నారు. మావోయిస్టు భావజాలంతో ఏదైనా సాధిద్దాం అనే ఆలోచన ఉన్న వ్యక్తులు ఆ ఆలోచనలను విరమించుకోవాలని సూచించారు. తుపాకీ గొట్టం ద్వారా ఏమీ సాధించలేమని పేర్కొన్నారు