
మెట్రో పనులను కేసీఆర్ ఆలస్యం చేశారు. రుణం రాకుండా కిషన్‌రెడ్డి అడ్డుకుంటున్నారు. కేంద్రం నిధులు ఇవ్వకుండా వివక్ష చూపుతోంది. Cm Revanth Reddy: హైదరాబాద్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ‘విశ్వనగరం’గా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Cm Revanth Reddy)స్పష్టం చేశారు. సోమవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మెట్రో రైల్ ప్రాజెక్టు విస్తరణ, ఎదురవుతున్న అడ్డంకులపై సుదీర్ఘంగా మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాంగ్రెస్ హయాంలో రూ.15వేల కోట్లతో ఈ మెట్రో పనులకు పునాది పడిందని ఆయన గుర్తుచేశారు. అయితే, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రాజెక్టు తీవ్రంగా ఆలస్యమైందని సీఎం ఆరోపించారు. కేసీఆర్ నిర్లక్ష్యం.. పెరిగిన అంచనా వ్యయాలు: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2014 నుండి 2017 మధ్య మూడేళ్ల పాటు మెట్రో పనులు పూర్తిగా నిలిచిపోయాయని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ రకరకాల సాకులు చెప్పి కాలయాపన చేయడం వల్లే ప్రాజెక్టు అంచనా వ్యయం అదనంగా రూ.7వేల కోట్లకు పైగా పెరిగిందని ధ్వజమెత్తారు. మొదటి దశ మెట్రో వల్ల ఏటా రూ.400 కోట్ల నష్టం వస్తోందని ఎల్‌అండ్‌టీ (L&T) సంస్థ చేతులెత్తేసిందని, అందుకే రెండో దశ (ఫేజ్-2) విస్తరణకు వారు నిరాకరించారని తెలిపారు. ఈ క్రమంలోనే రూ.30వేల కోట్ల విలువైన మెట్రోను రూ.15వేల కోట్లకు కొనుగోలు చేసే ప్రక్రియకు కేంద్రం సూచనలతో తాము సిద్ధమయ్యామన్నారు. కిషన్‌రెడ్డి అడ్డుపడుతున్నారు: సీఎం ధ్వజమెత్తారు: మెట్రో రెండో దశ విస్తరణ కోసం ఐఆర్ఎఫ్‌సీ (IRFC) నుంచి రూ.13,400 కోట్ల రుణాన్ని కేవలం 4 శాతం వడ్డీకే 20 ఏళ్ల కాలపరిమితితో పొందేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని సీఎం వివరించారు. ఇందుకోసం రూ.84 కోట్ల డాక్యుమెంట్ ఫీజుతో పాటు, ఈక్విటీ కింద రూ.1,400 కోట్లు కూడా జమ చేశామన్నారు. అయితే, మే 21న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రత్యేకంగా చొరవ తీసుకుని