మాట నిల బెట్టుకుంటున్న ప్ర భాస్
Actor ProfileActor

మాట నిల బెట్టుకుంటున్న ప్ర భాస్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మాట నిల బెట్టుకుంటున్న ప్ర భాస్
Telugu Times6 Sept 2026
మాట నిల బెట్టుకుంటున్న ప్ర భాస్

బాహుబలి(bahubali) ఫ్రాంచైజీ తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా తన మార్కెట్‌ను మరింత విస్తరించుకున్న ప్రభాస్(Prabhas) ఇప్పుడు తన కెరీర్‌లో అత్యంత కీలకమైన ప్రాజెక్ట్‌లలో ఒకటైన స్పిరిట్ పై పూర్తి దృష్టి పెట్టినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రీసెంట్ గా రిలీజైన రాజా సాబ్(Raja Saab) తర్వాత ప్రభాస్(prabhas) బాడీ డబుల్ వినియోగంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిస్క‌ష‌న్ నడిచింది. ఈ నేపథ్యంలో డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) తెరకెక్కిస్తున్న స్పిరిట్(Spirit) కోసం ప్రభాస్ స్పెష‌ల్ డిస్క‌ష‌న్ తీసుకున్నట్లు సమాచారం. యాక్షన్ సీన్స్ సహా వీలైనంత వరకు బాడీ డబుల్ ఉపయోగించకుండా స్వయంగా నటించాలని ఆయన నిర్ణయించుకున్నారని టాక్ వినిపిస్తోంది. డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి వంగా ఇప్పటికే స్క్రిప్ట్‌ను పూర్తి చేసినప్పటికీ, ప్రభాస్ డేట్స్‌కు అనుగుణంగా షూటింగ్‌ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రూపొందించిన షెడ్యూల్ ప్రకారం ప్రభాస్ భారీగా కాల్షీట్లు కేటాయించడంతో షూటింగ్ వేగంగా సాగుతోందని సమాచారం. ఇప్పటివరకు ప్లాన్ చేసిన షెడ్యూల్స్ ఎలాంటి ఆలస్యం లేకుండా పూర్తయ్యాయని, రీషూట్ల అవసరం కూడా రాకుండా పనులు ముందుకు వెళ్తున్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల లీకైన ప్రభాస్ కొత్త లుక్ కూడా అభిమానుల్లో సినిమాపై అంచనాలను మరింత పెంచింది. భారీ స్థాయి యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న స్పిరిట్‌ను సందీప్ రెడ్డి వంగా తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఒకేసారి పలు సినిమాలు చేస్తున్నప్పటికీ, ప్రభాస్ మాత్రం స్పిరిట్‌కే తొలి ప్రాధాన్యత ఇస్తున్నారని సమాచారం. డైరెక్ట‌ర్ కు ఇచ్చిన మాట ప్రకారం షూటింగ్‌కు పూర్తి సహకారం అందిస్తూ ప్రాజెక్ట్‌ను ప్లాన్ ప్రకారమే పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నారని టాలీవుడ్‌లో చర్చ నడుస్తోంది. అన్ని పనులు అనుకున్న షెడ్యూల్ ప్రకారం పూర్తైతే వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి