మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ.. భార్యతో కలిసి నాగర్ కర్నూల్ జిల్లా తుమ్మన్ పేటకు
Actor ProfilePolitician

మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ.. భార్యతో కలిసి నాగర్ కర్నూల్ జిల్లా తుమ్మన్ పేటకు

Total News1
Movie Updates0
Sources1
మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ.. భార్యతో కలిసి నాగర్ కర్నూల్ జిల్లా తుమ్మన్ పేటకు
TV9 Telugu14 Jun 2026
మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ.. భార్యతో కలిసి నాగర్ కర్నూల్ జిల్లా తుమ్మన్ పేటకు

స్టార్ హీరో విజయ్ దేవరకొండ, అందాల భామ రష్మిక మందన్న ఇటీవలే పెళ్లి చేసుకొని ఒక్కటైన విషయం తెలిసిందే. చాలా కాలంగా ప్రేమలో ఉన్న ఈ ఇద్దరూ వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఇక ఈ ఇద్దరూ పెళ్లి తర్వాత ఎవరి సినిమాలతో వారు ఫుల్ బిజీగా ఉన్నారు. హీరో విజయ్ దేవరకొండ సినిమాలతో పాటు పలు సామజిక సేవ కార్యక్రమాలతో ఎంతో మందికి సాయం చేస్తున్నారు. తాజాగా నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు స్కాలర్ షిప్స్ అందిస్తున్నారు విజయ్ దేవరకొండ-రష్మిక. ఈ ఏడాది ప్రారంభంలో.. పెళ్లి చేసుకున్న తర్వాత.. విజయ్ దేవరకొండ సొంతూరైన నాగర్ కర్నూల్ జిల్లా తుమ్మన్‌పేట గ్రామాన్ని సందర్శించారు. ఇది కూడా చదవండి : Jabardasth Vinod: జబర్దస్త్ లేకపోతే ఆ పని చేసేవాడిని.. అసలు విషయం చెప్పిన లేడీ గెటప్ వినోద్ ఆ సందర్భంగా.. అచ్చంపేట డివిజన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల టాపర్లకు స్కాలర్‌షిప్స్ అందిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకుంటూ ది దేవరకొండ ఫౌండేషన్ ద్వారా.. 44 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు స్వయంగా స్కాలర్‌షిప్స్ అందించారు విజయ్ దేవరకొండ-రష్మిక. 9, 10వ తరగతుల్లో.. 180 మంది ప్రతిభావంతులకు సహాయం చేశారు. గురువులు, తల్లిదండ్రులు చెప్పిన మాటలు వింటూ విద్యార్థులు ఉన్నత శిఖరాలు అదిరోహించాలని ఆకాంక్షించారు. ఇది కూడా చదవండి : ఇప్పుడున్న హీరోల్లో అతనొక్కడే నన్ను ఆంటీ అని పిలుస్తాడు.. జయసుధ ఆసక్తికర కామెంట్స్ ఆ మాటను నిలబెట్టుకుంటూ నేడు (జూన్ 14) విజయ్ దేవరకొండ తన భార్యతో కలిసి తన తండ్రి జన్మస్థలమైన నాగర్‌కర్నూల్ జిల్లా, అచ్చంపేట నియోజకవర్గంలోని తుమ్మన్‌పేట గ్రామానికి వెళ్లారు విజయ్. సొంతూరికి వచ్చిన ఈ కొత్త దంపతులకు గ్రామస్థులు ఘనస్వాగతం పలకనున్నారు. అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని 44 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 9, 10 తరగతుల విద్యార్థుల కోసం స్కాలర్‌షిప్ అందించనున్నారు విజయ్ రష్మిక. ది దేవరకొండ